రహదారుల సర్వేకు ప్రత్యేక వాహనం
రహదారుల సర్వేకు ప్రత్యేక వాహనం
Published Fri, Sep 23 2016 1:41 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
కర్నూలు (టౌన్): ఆస్ట్రేలియా టెక్నాలజీతో రూపొందించిన ప్రత్యేక వాహనాం ద్వారా జిల్లా వ్యాప్తంగా ర హదారులను సర్వే చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదురుగా వాహనాన్ని జిల్లా కలెక్టర్, రహదారులు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు శ్రీనివాసరెడ్డితో కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో రహదారులు, భవనాల శాఖ, ఆంధ్రప్రదేశ్ రోడ్ల అభివద్ధి సంస్థ పరిధిలో ఉన్న 3 వేల 670 కిలోమీటర్ల పొడువు ఉన్న రహదారులను సర్వే చేస్తున్నట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక ద్వారా తయారు చేసిన వాహనం ద్వారా జిల్లాలో రోడ్ల పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయవచ్చని తెలిపారు. నివేదిక అధారంగా వచ్చే రెండేళ్లలో జిల్లా లోని అన్ని రోడ్లను అభివద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాలో ఈ వాహనాం ద్వారా సర్వే పూర్తి అయినట్లు చెప్పారు. కార్యక్రమంలో రహదారులు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు జయరామిరెడ్డి, హరిబాబు, రాజేంద్ర, ఏపీఆర్‌డీసీ ఈఈ నాగరాజు, డీఈలు ఇందిరా, సిద్దారెడ్డి, పద్మనాభరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, జేఈలు ఫణిరామ్, నిశాకుమారి, వెంకటేశ్వర్లు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement