- మొక్కలు నాటడం ఆపొద్దు
- కలెక్టర్ నీతూప్రసాద్
హరితహారం వేగం పెంచండి
Published Mon, Jul 25 2016 9:59 PM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM
ముకరంపుర: హరితహారం కార్యక్రమం వేగం పెంచి జిల్లాలో విరివిగా మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, స్పెషల్ ఆఫీసర్లతో హరితహారం అమలుపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఆదివారం వరకు 1.81కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. వివిధ నర్సరీల్లో ఇంకా 1.70 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్ రోడ్లకిరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతీ గ్రామంలో 40వేల మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వస్థలాల్లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని, వాటి రక్షణకు బోర్‌వెల్‌లు మంజూరు చేస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలో 28మండలాల నుంచి హరితహారం మండల ప్రణాళికలు అందలేదని, వెంటనే పంపించాలని ఆదేశించారు. గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పశ్చిమ, తూర్పు డీఎఫ్‌వోలు వినోద్‌కుమార్, రవికిరణ్, డ్వామా పీడీ వెంకటేశ్వర్‌రావు, డీఆర్వో వీరబ్రహ్మయ్య, పంచాయతీరాజ్ ఎస్‌ఈ దశరథం, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement