ఆబ్కారీ ఉద్యోగులకు క్రీడాపోటీలు
గుంటూరు స్పోర్ట్స్: ఆబ్కారీ శాఖ జిల్లా స్థాయి క్రీడాపోటీలు ముగిశాయి. రెండవ రోజు శనివారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టెబుల్ టెన్నిస్ క్రీడాంశాలలో పోటీలు జరిగాయి. 60 మంది ఆబ్కారీ ఉద్యోగులు క్రీడాపోటీలలో పాల్గొన్నారు. పోటీలను ఆబ్కారీ శాఖ డీసీ పి.శ్రీమన్నారాయణ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభకనబర్చిన క్రీడాకారులను విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి ఆబ్కారీ క్రీడాపోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిడెంటెండెంట్ వి.రేణుక, అస్టింట్ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.