శ్రావణం..శుభకరం
శ్రావణం..శుభకరం
Published Fri, Aug 5 2016 5:38 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
పాతపోస్టాఫీసు :పాతనగరం కన్యకాపరమేశ్వరి ఆలయంలో 10.30 నుంచి 11.30 వరకూ మహిళలచే శ్రీ చక్ర సహిత కుంకుమ పూజలు, శ్రీ లలితా సహస్రనామ పారాయణం, శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం, శ్రీ లక్ష్మీ, శ్రీ భ్రమరాంబికా, శ్రీ రాజరాజేశ్వరీ అష్టకములు సామూహిక పారాయణం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 200 మంది భక్తులు కుంకుమార్చనలో పాల్గొన్నారు. పూలమాలలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.
ఆదుకోవమ్మా...కనకదుర్గ
పాతనగరంలోని శ్రీ విశాఖ సాగర కనకదుర్గ ఆలయం, లక్ష్మీదేవి ఆలయాల్లో తొలి శుక్రవారం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు నాలుగు విడతులుగా పూజలో పాల్గొన్నారు. ఆలయ మండపంలో సామూహిక కుంకుమార్చనలతో పాటు శ్రీ లక్ష్మీ హోమం చేపట్టారు.
Advertisement
Advertisement