మచిలీపట్నం: కృష్ణాజిల్లా నాగాయలంక సముద్ర తీరానికి శుక్రవారం తెల్లవారుజామున విదేశీ బోటు కొట్టుకు వచ్చింది. దీంతో మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సముద్ర తీరానికి చేరుకుని... బోటును పరిశీలించారు. సదరు బోటు శ్రీలంకకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
గతంలో ఈ బోటు సముద్రంలో మునిగిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తుపాన్ కారణంగా బోటు తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని పోలీసులు అంటున్నారు. దీనిపై పోలీసులు మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు.