తిరుమలలో 15న శ్రీరామనవమి ఆస్థానం | sri ramanavami astanam on april 15 | Sakshi
Sakshi News home page

తిరుమలలో 15న శ్రీరామనవమి ఆస్థానం

Published Tue, Apr 12 2016 4:04 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

sri ramanavami astanam on april 15

సాక్షి, తిరుమల: ఈనెల 15వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ దర్శనమిస్తారు. రాత్రి 10 గంటల తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థానం  నిర్వహిస్తారు. ఆ రోజు నిర్వహించే నిజపాద దర్శనం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దుచేశారు. అలాగే, 16వ తేదీ రాత్రి 8 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఆరోజు వసంతోత్సవ సేవ రద్దు చేయగా,  మిగిలిన సేవలు యథావిధిగా కొనసాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement