భార్యను వేధిస్తున్నాడని హతమర్చాడు..
కాశీపేట(ఆదిలాబాద్): ఓ వివాహితను వేధిస్తున్న దుండగుడు, ఆమె భర్త చేతిలోనే చివరికి హతమయ్యాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కాశీపేట మండలంలో గురువారం చోటుచేసుకుంది. కాశీపేట మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన రఘు అనే వ్యక్తి భార్యను అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ గత కొద్దిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త, ఆవేశంతో శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.