కంభం చెరువు చైర్మన్‌గా శ్రీపతి బాలకోటయ్య | sripati balakotayya appointed as kambham pond chairman | Sakshi
Sakshi News home page

కంభం చెరువు చైర్మన్‌గా శ్రీపతి బాలకోటయ్య

Published Sat, Jul 16 2016 6:35 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

sripati balakotayya appointed as kambham pond chairman

సమావేశం అని చెప్పి కంభం చెరువు కమిటీ ఎన్నిక
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా వెంకట రాంబాబు సూచించిన వ్యక్తులకే పదవులు
విషయం బయటకు వస్తే తలనొప్పులు వస్తాయని గుట్టుగా ఉంచిన వ్యవహారం

బేస్తవారిపేట: కంభం చెరువు చైర్మన్‌గా కంభం మండలం హజరత్‌గూడెం నీటి సంఘం అధ్యక్షుడు శ్రీపతి బాలకోటయ్య నియామకం శుక్రవారం జరిగినట్లు సమాచారం అందింది. మార్కాపురం ఇరిగేషన్‌శాఖ కార్యాలయంలో సమావేశం ఉం దని రెండు రోజుల కిందట ఇరిగేషన్‌శాఖ అధికారులు పాపాయిపల్లె, చిన్న కంభం, హజరత్‌గూడెం నీటి సంఘం అధ్యక్షులకు సమాచారం పంపారు. ఆరు నెలల కిందట నియమించాల్సిన చెరువు కమిటీని హడావుడిగా గుట్టుగా జరిపించారు.

మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు సూచించిన హజరత్‌గూడెం నీటి సంఘం అధ్యక్షుడిని చైర్మన్‌గా, పాపాయిపల్లె నీటి సంఘం అధ్యక్షుడు బొగ్గు శ్రీహరిని వైస్ చైర్మన్‌గా, చిన్న కంభం నీటి సంఘం అధ్యక్షుడు పాలాబత్తుని కృష్ణయ్యను సభ్యుడిగా ఎన్నిక చేశారు. చీతిరేల కతువ, నక్కల గండి నీటి సంఘానికి ఇంతవరకు ఎన్నికలు జరగకపోవడంతో ఉన్న ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విషయం బయటకు వస్తే అధికార పార్టీలోకి మారిన ఎమ్మెల్యేతో తలనొప్పులు వస్తాయని కమిటీ ఎన్నిక విషయాన్ని గుట్టుగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement