శ్రీశైలం డ్యాం నీటిమట్టం 880.60 అడుగులు
Published Sat, Oct 22 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 880.60 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి వస్తున్న 8వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నుంచి 32,041 వేల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు విడుదలవుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో నాలుగు జనరేటర్లతో ఉత్పత్తి చేస్తూ 23,341 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 6వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,700 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 191.2118 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Advertisement
Advertisement