శ్రీశైలంలో 26 టీఎంసీల నీటి నిల్వలు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయంలో శనివారం సాయంతానికి 26.2222 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. దిగువ నాగార్జునసాగర్‌కు రోజుకు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తుండడంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 794.10 అడుగులుగా నమోదైంది. తెరచి ఉంచిన రెండు రివర్ స్లూయిస్‌గేట్లలో ఒక్క గేటు ఎత్తును 8 అడుగులకు కుదించి రెండు గేట్ల ద్వారా 14,503 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 320 క్యూసెక్కులను వినియోగించుకుని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో స్వల్పంగా 0.135 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.