రామకృష్ణకు రాష్ట్రస్థాయి పురస్కారం
కరీంనగర్‌కల్చరల్: ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు, అధ్యాపకుడు కల్వకుంట రామకృష్ణ తేజ ఆర్ట్ క్రియేషన్స్ వారి రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారాన్ని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారె చేతుల మీదుగా అందుకున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారం అందించారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి రామకృష్ణ చేస్తున్న సాహితీ సేవలను ప్రశంసించారు. ఆయనకు ప్రశంసపత్రం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి, ఆచార్య మసన చెన్నప్ప, కసిరెడ్డి వెంకటరెడ్డి, దేవదాసు, శ్రీరంగాచార్య, ఆచార్య భాగయ్య, తేజ ఆర్ట్స్ చైర్మన్ పోరెడ్డి రంగయ్య, యువభారతి అధ్యక్షుడు వేద చంద్రయ్య, చిమ్మపూడి శ్రీరామమూర్తి, సోమ సీతారాములు, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.