రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా వాసుల సత్తా
కడప స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–19 బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో నిర్వహించిన అంతర్ జిల్లాల బ్యాడ్మింటన్ క్రీడాపోటీల్లో జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఛాంపియన్‌షిప్‌ను సాధించడంతో పాటు ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే ఏపీ జట్టుకు ఎంపికయ్యారు. ఐదుగురు సభ్యులు జట్టులో ముగ్గురు క్రీడాకారులు కడపకు చెందిన వారు కావడం గమనార్హం. నవంబర్ చివరి వారంలో మహారాష్ట్రలోని నాసిక్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన దత్తాత్రేయరెడ్డి, పవన్‌కుమార్, అబ్దుల్‌రెహమాన్‌లు పాల్గొననున్నారు. టీం ఛాంపియన్‌షిప్‌తో పాటు వ్యక్తిగత విభాగాల్లో దత్తాత్రేయరెడ్డి, పవన్‌కుమార్, అబ్దుల్‌రెహమాన్‌లు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరి ప్రదర్శన పట్ల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జిలానీబాషా, ఎల్.ఆర్ పల్లిలోని ఎస్.వి. కళాశాల ప్రిన్సిపాల్ వాసుదేవరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, సుబ్బరాజు హర్షం వ్యక్తం చేశారు.