రైతులకు పరిహారంపై ధర్నా | strike on formers Compensation | Sakshi
Sakshi News home page

రైతులకు పరిహారంపై ధర్నా

Published Sun, Jun 19 2016 8:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

రైతులకు పరిహారంపై ధర్నా - Sakshi

రైతులకు పరిహారంపై ధర్నా

రైతులకు న్యాయం చేసే చట్టాలకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం
కిసాన్ కేత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదంరెడ్డి

పవర్‌గ్రిడ్  విద్యుత్ టవర్‌ల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం నగరంలో జిల్లా కాంగ్రెస్, కిసాన్ కేత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన  కిసాన్‌కేత్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి   పాల్గొన్నారు.
- నిజామాబాద్ సిటీ

నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తోందని కిసాన్‌కేత్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. రైతులకు మేలు చేసే చట్టాలకు తూట్లుపొడుస్తోందని ఆరోపించారు. పవర్‌గ్రిడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 765 విద్యుత్ ట వర్‌ల నిర్మాణంలో భూములు కోల్పోతు న్న జిల్లా రైతులకు నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేస్తూ శనివారం నగరంలోని ధర్నాచౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ, కిసాన్ కేత్ కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన కోదండరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ టవర్‌ల నిర్మాణం వల్ల వ్యవసాయభూములు కోల్పోతున్న వారికి పూర్తి స్థాయి లో నష్టపరిహారం చెల్లించాలని చట్టాలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నష్టపరిహారం ఇప్పించే విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా కలెక్టర్‌కు ఉందని, కలెక్టర్ చొరవ చూపి రైతులకు వారం రోజుల్లో న్యాయం చేయాలన్నారు. రైతులకు న్యా యం చేసే విషయంలో కలెక్టర్ సుముఖంగా ఉన్నా పాలకులు ఒత్తిడి తెచ్చి అడ్డుకుంటున్నారన్నారు. కలెక్టర్ తక్షణమే రైతులు, మేధావులతో కూడిన కమిటీని వేసి రైతులకు న్యాయం చేయాలన్నారు.  విద్యుత్ టవర్‌ల నిర్మాణంతో నష్టపోయి న రైతులకు నష్టపరిహారం ఇప్పించే విషయంలో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఓ విధంగా, నిజామాబాద్ జిల్లాలో మరో విధంగా వ్యవహరిస్తోందన్నారు.

జిల్లాకు చెందిన రైతులకు అన్యాయం జరుగుతున్నా వ్యవసాయశాఖ మంత్రి స్పందిం చకపోవడం బాధాకరమన్నారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వారికి, వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వారికి ట్రాక్టర్‌లు పంపిణీ చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపించాలన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులను ఒప్పించి భూమి సేకరించడం చేతగాక తమ పార్టీపై బురదజల్లుతున్నారని విమర్శించారు.

 ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం - మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి
విద్యుత్ టవర్‌ల నిర్మాణంతో భూములు కోల్పోయి నష్టపోతున్న రైతులకు న్యా యం జరిగే వరకు ఆందోళనలు చేస్తామని, ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి అన్నారు. టవర్‌ల నిర్మాణం వల్ల తాము కోల్పోతున్న భూమికి నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రాధేయపడుతున్నా ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. అనంతరం విద్యుత్‌రంగ నిపుణుడు ప్రొఫెసర్ నర్సింహరెడ్డి మాట్లాడుతూ రైతులు నష్టపరిహారం ఏ విధంగా పొందాలో వివరించారు.

ధర్నాలో మాజీ విప్ ఈరవత్రి అనిల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, కిసాన్ కేత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి,  నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, నగర అధ్యక్షురాలు చంద్రకళ, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ శేఖర్‌గౌడ్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు మోహన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బంటు బలరాం, కోశాధికారి మీసా ల సుధాకర్‌రావు, కార్పొరేటర్ రఘు, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్, నాయకులు మానాల మోహన్‌రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బంటురాము, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి సుమన్, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement