గిరిజన విద్యార్థి మృతి
గిరిజన విద్యార్థి మృతి
Published Thu, Jul 21 2016 11:27 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
మర్రిపాలెం అనారోగ్యంతో ఓ గిరిజన విద్యార్థి మృతిచెందాడు. వసతి గహ నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు పోయాయని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) ప్రతినిధులు ఆందోళకకు దిగారు. కప్పరాడ గిరిజన వసతిగహ భవనంలో బోయిన రాజ్‌కుమార్(20) ఉంటున్నాడు. కష్ణా డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. స్వస్థలం దుంబ్రిగుడ మండలం కురిడి గ్రామం. గత 15 రోజులుగా పచ్చకామెర్ల వ్యాధితో రాజ్‌కుమార్ బాధపడుతున్నాడు. వ్యాధి ఎక్కువకావడంలో నీరసించిపోయాడు. తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు, సాంఘిక సంక్షేమ అధికారులు సమాచారం అందించారు. అయినా మెరుగైన వైద్యం లభించలేదు. గురువారం మధ్యాహ్నం రాజ్‌కుమార్ ఆరోగ్యం క్షీణించడంతో తోటి విద్యార్థులు స్పందించారు. 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే రాజ్‌కుమార్ మతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మతదేహాన్ని స్వస్థలం తరలించారు. అయితే వసతి గహం నిర్వాహకులు విద్యార్థి మృతిని రహస్యంగా ఉంచారు. అధికారుల నిర్లక్ష్యంతో రాజ్‌కుమార్ చనిపోయాడని తెలిసి ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు గురువారం రాత్రి వసతి గహంలో నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు కంచరపాలెం పోలీసులు అడ్డుపడ్డారు. శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.
Advertisement