పాముకాటుతో విద్యార్థి మృతి
Published Sat, Sep 24 2016 1:48 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
ఎమ్మిగనూరు రూరల్: కలుగోట్ల గ్రామంలో ఓ విద్యార్థి పాము కాటుకు గురై మృతి చెందాడు. గ్రామానికి చెందిన కారం వ్యాపారి బోయ రాజు, ధనలక్ష్మీ దంపతులకు తేజ, ఉపేంద్ర(7) సంతానం. గురువారం రాత్రి భోజనాల అనంతరం కుటుంబీకులు గుడిసెలో నిద్రించారు. గుడిసె కాలనీ చివరన ఉండటం, వర్షం పడటంతో రాత్రి పాము గుడిసెలోకి వచ్చి నిద్రిస్తున్న బోయ ఉపేంద్రను కాటు వేసింది. కొద్ది సేపటికి తీవ్ర అస్వస్థకు గురికావటంతో తండ్రి లైటు వేసి చూడగా దుప్పటిలో నుంచి పాము బయటకు రావటం గమనించి కట్టెతో చంపేశాడు. వెంటనే కుమారుడిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. ఉపేంద్ర స్థానిక ఎంపీపీ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మృతికి సంతాపంగా శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.
Advertisement
Advertisement