
రెండతస్తుల భవనంపై నుంచి పడిçపోయిన విద్యార్థిని
హిందూపురం అర్బన్ : పట్టణంలోని డీవీ కాలనీలో రెండతస్తుల భవనం నుంచి బీటెక్ చదువుతున్న విద్యార్థిని లావణ్య (18) శనివారం ఉదయం కింద పడి తీవ్రంగా గాయపడింది. వివరాలు.. రొద్దం మండలానికి చెందిన లావణ్య డీబీ కాలనీలో ఒకరి ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ స్థానిక బిట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతోంది.
అయితే ఉదయం బ్రష్ చేసుకుని నిద్రమత్తులో భవనం పైనుంచి జారి కిందకు పడిపోయింది. దీంతో ముఖానికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి ప్రాణపాయం తప్పిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు టుటౌన్ పోలీసులు తెలిపారు.