స్కూల్ బస్సు బోల్తా : ఇద్దరు విద్యార్థులకు గాయాలు
కర్లపాలెం (గుంటూరు): పాఠశాల బస్సు బోల్తాపడి ఇరువురు విద్యార్థులకు, డ్రై వర్‌కు గాయాలైన సంఘటన సోమవారం రాత్రి కర్లపాలెం మండలం కప్పలవానిపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్లకు చెందిన సాధన ప్రై వేటు పాఠశాల బస్సు సోమవారం సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తరువాత విద్యార్థులను ఎక్కించుకుని కప్పలవానిపాలెం వచ్చింది. అక్కడ విద్యార్థులను దించి సమ్మెటవారిపాలెం వచ్చేందుకు బస్సును డ్రై వర్ రివర్స్ చేస్తుండగా బస్సు రోడ్డుపై నుంచి వెనుకకు జారి పక్కకు ఒరిగి పొలాల్లో పడింది. ఈ సంఘటనలో బస్సు డ్రై వర్‌తో పాటు సమ్మెటవారిపాలెం గ్రామానికి చెందిన ఒకటో∙తరగతి చదువుతున్న పిట్టు ఓబులరెడ్డి, ఎల్‌కేజీ చదువుతున్న నంగు జగదీష్‌రవికుమార్‌రెడ్డికి గాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థులను తల్లిదండ్రులు ఆటోలో కర్లపాలెంలోని ప్రై వేటు వైద్యశాలకు తరలించారు.