చికిత్స పొందుతూ ఇంటర్‌ విద్యార్థి మృతి | student killed during treatment, | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఇంటర్‌ విద్యార్థి మృతి

Published Fri, Apr 14 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

student killed during treatment,

ముద్దనూరు:  స్థానిక పాత సినిమా థియేటర్‌ వెనుకభాగంలో నివసిస్తున్న లక్షుమయ్య(19) అనే వ్యక్తి కిరోసిన్‌ స్టవ్‌ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఏఎస్‌ఐ జయరాముడు సమాచారం మేరకు.. ఇంటర్‌మీడియేట్‌ ప్రథమ సంవత్సరం పూర్తయిన లక్షుమయ్య ఈనెల 8వతేదీన  రాత్రి నీళ్లు కాచుకోవడానికి కిరోసిన్‌ స్టవ్‌ అంటించాడు. స్టవ్‌ పంపు కొడుతుండగా ప్రమాదవశాత్తు కిరోసిన్‌ ఒంటిపై పడడంతో మంటలు చెలరేగి లక్షుమయ్య శరీరం తీవ్రంగా కాలింది. చికిత్స నిమిత్తం అదేరోజు లక్షుమయ్యను కడప రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తిరుపతికి అనంతరం తమిళనాడులోని వేలూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement