ఇంటర్‌ విద్యార్థి అదశ్యం | student missing in arumakulapalli | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి అదశ్యం

Published Tue, Jul 26 2016 10:53 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

student missing in arumakulapalli

చిలమత్తూరు : స్థానిక ప్రభుత్వ డీవీఅండ్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని టేకులోడు పంచాయతీ ఆరుమాకులపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ, ఆదినారాయణప్ప దంపతుల కుమారుడు నరసింహమూర్తి స్థానిక జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.


కాగా గత రెండు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో మంగళవారం తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement