అవినీతి డీఈఓపై ఉద్యమం | student movement by Deo corruption | Sakshi
Sakshi News home page

అవినీతి డీఈఓపై ఉద్యమం

Published Mon, Jul 25 2016 11:41 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

అవినీతి డీఈఓపై ఉద్యమం - Sakshi

అవినీతి డీఈఓపై ఉద్యమం

కడప ఎడ్యుకేషన్‌:

అవినీతి డీఈఓను జైలుకు పంపే వరకూ ఉద్యమాన్ని ఆపమని, డీఈఓను విధుల నుంచి తొలగించాల్సిందేనని వైఎస్సార్‌ఎస్‌యూ, ఆర్‌ఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్‌ చేశారు. డీఈఓకు వ్యతిరేకంగా సోమవారం విద్యారిథసంఘ నాయకులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డీఈఓపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడేందుకు కలెక్టర్‌ అనుమతించడంతో కొద్దిమంది లోపలికి వెళ్లి కలెక్టర్‌తో మాట్లాడారు. అనంతరం వైఎస్సార్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఖాజారహ్మతుల్లా, ఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ దస్తగిరి, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అంకన్నలు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థ అవినీతి మయంగా మారిందన్నారు. డీఈఓ తన రెండేళ్ల పదవీ కాలంలో ఒక్కసారి కూడా కార్పొరేట్‌ పాఠశాలలను సందర్శించలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement