కడుపునొప్పి తాళలేక విద్యార్థిని ఆత్మహత్య | student suicide | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Nov 17 2016 12:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

student suicide

ఆలూరు రూరల్‌ : చిప్పగిరి మండలంలోని రామదుర్గం గ్రామంలో బుధవారం ఓ విద్యార్థిని కడుపునొపి​‍్ప తాళలేక ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామదుర్గంకు  చెందిన రైతు పోతన్న, తిప్పమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.  కుమార్తె కవిత(14) స్థానిక ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఏడాది నుంచి ఈ బాలిక కడుపునొపి​‍్పతో బాధపడుతుంది. బుధవారం   స్కూలుకు వెళ్లి వచ్చిన తర్వాత నొప్పి ఎక్కువ  కావడంతో ఇంట్లోని పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొద్దిసేపటికి పొలం నుంచి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు అపస్మారకస్థితిలో పడి ఉన్న బిడ్డను చూసి ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో  కోలుకోలేక   కవిత మృతిచెందింది.  ఈ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement