నిరుపయోగంగా నీటిపథకాలు
Published Tue, Aug 9 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
చెన్నూర్ రూరల్ : మండలంలోని బుద్దారం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. చేతిపంపు మొత్తానికి పనికి రాకుండా మారింది. దీంతో అధికారులు బోరును ఏర్పాటు చేసి విద్యుత్ మోటర్ అమర్చారు. కానీ బోరు విద్యుత్ మోటర్ కాలిపోయి బోరులోనే పడిపోయింది.
దీంతో విద్యార్థులకు తాగేందుకు నీరు కరువైంది. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు కొందరు తాగునీటి కోసం ఇళ్లకు వెళ్తుండగా, మరి కొందరు విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి బాటిళ్లలో తాగేందుకు నీటిని తీసుకొని వస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకొని విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Advertisement