పక్కదారి పడుతున్న సబ్‌ప్లాన్ నిధులు
పక్కదారి పడుతున్న సబ్‌ప్లాన్ నిధులు
Published Sat, Apr 1 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
– నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య అన్నారు. శనివారం.. కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, పక్కనే పీఅండ్‌టీ కాలనీలో బాబూ జగజ్జీవన్‌రామ్‌ల సిమెంటు విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పారుమంచాల గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3 కోట్ల సబ్‌ప్లాన్ నిధులు వాడారన్నారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, దళితులు కలిసికట్టుగా వాటిని పెంచుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పోస్టల్, టెలికాం శాఖలు కలిసి ఉన్న సమయంలో పీఅండ్‌టీ కాలనీ ఏర్పడిందని, 1956లో ఈ కాలనీ నిర్మాణానికి అప్పటి డిప్యూటీ ప్రధాని బాబుజగజ్జీవన్‌రామ్ శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆయన శంకుస్థాపన చేసిన కాలనీలోనే విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా చాలా ఆనందం కలిగిందన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ పి.ఎస్.జాన్ అధ్యక్షతన నిర్వమించిన కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు, పోస్టుమాస్టర్ వై.డేవిడ్, బీఎస్‌ఎన్‌ఎల్ డీజీఎంలు టి.సురేశ్, ఎస్.పి.నాగరాజురావు, అక్బర్‌బాష, ప్రభుత్వ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీరాములు, మాజీ కార్పొరేటర్ గున్నామార్క్ పాల్గొన్నారు. రెండు విగ్రహాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం పట్ల దళిత సంఘాల నాయకులను ఐజయ్య అభినందించారు. తాను ఇప్పటి వరకు 36 అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించినట్లు తెలిపారు.
Advertisement
Advertisement