ఓర్వకల్లు: భార్యాభర్తల మధ్య కలహాలు ఒకరి ప్రాణం తీశాయి. తెల్లారితే ఆనందంగా పండుగ నిర్వహించాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా (డీజిల్‌బాష)కు కోడుమూరు మండలం లద్దగిరి గ్రామానికి చెందిన కుర్షిద్‌జహ (32)తో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కుమారులు ఇద్దరు హైదరాబాద్‌లో పాలిష్‌కట్టర్లుగా పని చేస్తున్నారు. భర్త మహబూబ్‌బాష ఊర్లోనే డీజిల్ వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం భార్యాభర్తలు ఇద్దరు ఓ రైతు పొలానికి కూలీకి వెళ్లారు. అక్కడే కుటుంబ కలహాలతో ఇద్దరు వాగ్వాదపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన కుర్షిద్‌జహా సాయంత్రం ఇంటికి చేరుకుని పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మంగళవారం మతి చెందింది. మతురాలి సోదరుడు షేక్షావలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.