సుజాత హోటల్‌ నిర్వాహకులపై కేసు | Sujata Hotel in the management of the case | Sakshi
Sakshi News home page

సుజాత హోటల్‌ నిర్వాహకులపై కేసు

Published Thu, Dec 8 2016 10:55 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Sujata Hotel in the management of the case

అనంతపురం సెంట్రల్‌ :  తినుబండారాలను అధికధరలకు విక్రయిస్తున్న సుజాత హోటల్‌పై కేసు నమోదు చేసినట్లు తూనికలు కొలతలుశాఖ సీఐ శంకర్‌ తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు గురువారం నగరంలో పలు హోటళ్ళపై దాడులు నిర్వహించామన్నారు. డీఈఓ కార్యాలయం సమీపంలోని సుజాతహోటల్‌లో పకోడ, మిశ్చర్‌ తదితర వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. నిబంధనల మేరకు రేట్ల పట్టిక వేయాల్సి ఉన్నా, సదరు నిర్వాహకులు ఏర్పాటు చేయకపోవడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే సప్తగిరి సర్కిల్‌లోని ప్రశాంతి హోటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా, అధిక రేట్లకు వాటర్‌బాటిల్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. రైల్వే స్టేషన్‌లలో విక్రయించాల్సిన వాటర్‌బాటిల్స్‌ను తెప్పించినట్లు తేలిందన్నారు. దీంతో సదరు హోటల్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement