managers
-
ఇక మేనేజర్లు ఉండరు.. ప్రముఖ కంపెనీ వినూత్న ప్లాన్!
జర్మన్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం బేయర్ వినూత్న ప్రణాళిక రచించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. బేయర్ కొన్ని నిర్మాణాత్మక మార్పులు చేస్తోంది. కార్పొరేట్ బ్యూరోక్రసీని తగ్గించడం, ఉద్యోగులకు ఎక్కువ స్వయంప్రతిపత్తి కల్పించడం, వ్యాపారాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించేలా చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిల్ ఆండర్సన్ దీనికి "డైనమిక్ షేర్డ్ ఓనర్షిప్" అని పేరు పెట్టారు. కంపెనీ నిబంధనలకు సంబంధించి 1,300 జీలకుపైగా ఉన్న లిటరల్ కార్పొరేట్ రూల్‌బుక్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇది 'వార్ అండ్ పీస్' పుస్తకం కంటే ఎక్కువగా ఉందని చమత్కరించారు. మిడిల్ మేనేజర్లను తగ్గించి, ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడంలో ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని యోచిస్తున్నట్లు బిల్ ఆండర్సన్ తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఈ కొత్త వ్యవస్థ గురించి గురించి న్యూజెర్సీలో కొంతమంది ఉద్యోగులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. నూతన ప్రణాళికలో భాగంగా తొలగించనున్న మేనేజర్ల సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. అయితే యూఎస్‌కు చెందిన వేలాది మంది మేనేజర్లకు కంపెనీ ఇతర ఉద్యోగాలు కేటాయించనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. బేయర్స్ సీఈవో అండర్సన్ ప్రతిపాదన కంపెనీ సంస్థాగత ఖర్చులను సుమారు 2 బిలియన్ యూరోలు తగ్గిస్తుందని జర్మన్ కార్పొరేషన్ మార్చిలో పేర్కొంది. గత సంవత్సరంలో బేయర్ షేర్లు 60.40 యూరోల నుండి 27.64 యూరోలకు 50 శాతానికి పైగా పడిపోయాయి. కంపెనీ సుమారు 34 బిలియన్ యూరోల రుణంపై నడుస్తోంది. -
‘సంతోషమే సగం బలం’.. భారత్‌లో మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం ఇదే!
ముంబై: పని ప్రదేశంలో సంతోషంగా ఉన్నామని 70 శాతం మంది ఉద్యోగులు చెబుతున్నారు. సంతోషంగా ఉండడానికి మేనేజర్ల మద్దతు కీలకమని వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ జాబ్ పోర్టల్ ఇండీడ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. 30 శాతం మంది ఉద్యోగులు పని విషయంలో ఓ స్థాయి అసంతృప్తిని వ్యక్తం చేశారు. వివిధ రంగాలకు చెందిన 1,219 సంస్థలు, 2,537 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఇండీడ్ తరఫున వాలువాక్స్ అనే సంస్థ సర్వేలో భాగంగా తెలుసుకుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఉద్యోగం తమ అన్ని రకాల సంతోషానికి సాయపడుతున్నట్టు 58 శాతం మంది భావిస్తున్నారు. ఉద్యోగుల ఆనందానికి మేనేజర్లదే ప్రధాన బాధ్యత అని 95 శాతం మంది భావిస్తున్నారు. సానుకూల పని వాతావరణానికి నాయకత్వ పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు. మద్దనునిచ్చే మేనేజర్లతోపాటు.. అర్థవంతమైన పని, నైపుణ్యాల వినియోగం, సవాళ్లు, సృజనాత్మకంగా ఉండడం, మంచి బృందంతో కలసి పనిచేయడం అన్నవి ఉద్యోగుల్లో సంతోషాన్ని కలిగించే ఇతర అంశాలని సర్వే నివేదిక వెల్లడించింది. వీరిలో అసంతృప్తి అయితే 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న ఉద్యోగుల్లో 74 శాతం మంది, 2 ఏళ్లలోపు అనుభవం కలిగిన ఉద్యోగుల్లో 54 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీర్ఘకాలంగా పనిచేసే ఉద్యోగుల్లో స్తబ్దత నెలకొంటే, కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే వారు కుదురుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫలితమే ఈ స్పందన అని ఇండీడ్ నివేదిక తెలిపింది. ఎఫ్ఎంసీజీ రంగంలో 81 శాతం, ఐటీ/ఐటీఈఎస్‌లో 81 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో 80 శాతం, రిటైల్‌లో 78 శాతం మంది పనిలో ఆనందం ఉన్నట్టు చెప్పారు. ఆటోమొబైల్ రంగంలో 59 శాతం, లాజిస్టిక్స్‌లో 58 శాతం, నిర్మాణ రంగంలో 58 శాతం మంది పనిలో సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. స్థిరత్వం, వృద్ధి అవకాశాలు తక్కువగా ఉండడం తక్కువ మంది సంతోషంగా ఉన్నామని చెప్పడానికి కారణం. చిన్న కంపెనీల్లో 73 శాతం, పెద్ద కంపెనీల్లో 79 శాతం మంది ఉద్యోగులు పనిలో ఆనందంగా ఉన్నారు. అదే మధ్యసైజు కంపెనీల్లో సంతోషంగా ఉన్నామని చెప్పిన వారు 61 శాతంగానే ఉన్నారు. ‘‘చాలా సంస్థలు తమ ఉద్యోగుల సంతోషానికి ప్రాధాన్యం ఇస్తుండడం వారిలో సంతృప్తి పెరగడానికి కారణం. ఈ ఆనందం అంతిమంగా మెరుగైన ఉత్పాదకతకు దారితీస్తుంది. స్థిరమైన వ్యాపార విజయాలకు తోడ్పడుతుంది’’అని ఇండీడ్ ఇండియా టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్ రోహన్ సిల్వెస్టర్ తెలిపారు. -
మేనేజర్లకు ఆదేశాలు..ఉద్యోగుల్లో క్షణ క్షణం.. భయం.. భయం!
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం డిస్నీ భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించునుంది. ఇందులో భాగంగా తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్ల బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ తెలిపింది. ఉద్యోగులకు తొలగింపుపై డిస్నీ స్పందించింది. ఏప్రిల్ నెలలో 4 వేల మందిని ఫైర్ చేస్తున్నట్లు తెలిపినట్లు బిజినెస్ ఇన్సైడర్ తన కథనంలో పేర్కొంది. సంస్థ పునర్నిర్మాణం, కంటెంట్‌ను తగ్గించడంతో పాటు ఉద్యోగుల జీతంలోనూ కోత పెట్టేందుకు కంపెనీ యోచిస్తున్నది. ‘ఇది కఠినమైన నిర్ణయమే. ఉద్యోగుల తొలగింపులతో 5.5 బిలియన్ల డాలర్లను ఆదా చేసుకోవడం ద్వారా స్ట్రీమింగ్ బిజినెస్‌ను మరింత లాభదాయకంగా మర్చుకోవచ్చు. పునర్వ్యవస్థీకరణ మరింత ఖర్చుతో కూడుకుంది. మా వ్యాపారాలను మరింత సమర్ధవంతంగా, ఆర్ధిక సవాళ్లతో కూడిన వాతావరణంలో కార్యకాలాపాలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాము. కాబట్టే 5.5 బిలియన్ల ఖర్చును ఆదా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని సీఈవో బాబ్ ఇగర్ చెప్పారు. ఇక లేఆఫ్స్‌పై డిస్నీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ రంగాల్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా తొలగింపులు తమని ఏ విధంగా ఇబ్బంది పెడతాయోనని క్షణమొక యుగంలా గడుపుతున్నారు. -
ఒక రూపాయి కూడా ఆశించకుండా పనిచేయాలి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా కేటీఆర్ ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా, సుమారు లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశామని అన్నారు. ప్రైవేటు రంగంలో అనేక పెట్టుబడులను ఆకర్షించి 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఒక ప్రత్యేకత ఉందని.. ప్రజలకు సేవ చేయడంలో తమదైన మార్కు చూపించాలని విజ్జప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఒకరూపాయి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా సాధించారో.. అలాగే ఒక రూపాయి తీసుకోకుండా నిజాయతీగా వ్యవహరించాలని కోరారు. అభ్యర్థులు ఈ ఉద్యోగాన్ని ఒక సవాలుగా తీసుకొని జలమండలిని మరింత అభివృద్ది పథాన తీసుకెళ్లేలా కొత్త ఆలోచనలతో పనిచేయాలని సూచించారు. చదవండి: కొంగొత్త అంగడి.. నగరంలో ఇక ప్రతిరోజు మార్కెటే! -
ఫండ్స్‌లో రాణిస్తున్న మహిళా మేనేజర్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మహిళలు క్రమంగా పాగా వేస్తున్నారు. ఫండ్ మేనేజర్ల విభాగంలో మహిళల ప్రాతినిధ్యం భారత్‌లో పెరిగినట్టు మార్నింగ్‌స్టార్ నివేదిక తెలియజేసింది. అయితే దేశంలోని మొత్తం ఫండ్ మేనేజర్లలో మహిళల వాటా ఇప్పటికీ 8 శాతం స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. ‘‘376 ఫండ్ మేనేజర్లకు గాను 30 మందే మహిళలు ఉన్నారు. వీరు ప్రైమరీ లేదా సెకండరీ ఫండ్ మేనేజర్లుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌కు సేవలు అందిస్తున్నారు. గతేడాది మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య 28. మొత్తం 19 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలో 30 మంది మహిళా ఫండ్ మేనేజర్లు పనిచేస్తున్నారు. వీరి కాల వ్యవధిని పరిశీలిస్తే.. 10 మంది గడిచిన ఐదేళ్లుగా నిలకడగా ఫండ్స్ నిర్వహణ చూస్తున్నారు. మరో 12 మంది మూడు నుంచి ఐదేళ్లుగా ఫండ్స్ నిర్వహణ బాధ్యతలో ఉన్నారు. ఇక 8 మంది మహిళా ఫండ్ మేనేజర్ల కాల వ్యవధి చాలా తక్కువగానే ఉంది’’ అని మార్నింగ్ స్టార్ నివేదిక వివరించింది. 2021 జనవరి నాటికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఇన్వెస్టర్ల ఆస్తులు రూ.30.50 లక్షల కోట్లకు వృద్ధి చెందిన విషయం తెలిసిందే. ‘‘మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2017లో మార్నింగ్ స్టార్ నివేదికను విడుదల చేసే నాటికి మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య 18గా ఉంది. 2018లో 24కు, 2019లో 29కు చేరుకోగా, 2020లో 28.. 2021 నాటికి 30కు చేరుకుంది. 8 శాతం మంది మహిళా మేనేజర్లు అంటే మ్యూచు వల్ ఫండ్స్ పరిశ్రమలో చాలా తక్కువ ప్రాతినిధ్యమే’’ అని మార్నింగ్ స్టార్ నివేదిక పేర్కొంది. -
మ్యూచువల్ ఫండ్స్‌లో రా‘రాణులు’
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మహిళలు క్రమంగా పాగా వేస్తున్నారు. ఫండ్ మేనేజర్ల విభాగంలో మహిళల ప్రాతినిధ్యం భారత్‌లో పెరిగినట్టు మార్నింగ్‌స్టార్ నివేదిక తెలియజేసింది. అయితే దేశంలోని మొత్తం ఫండ్ మేనేజర్లలో మహిళల వాటా ఇప్పటికీ 8 శాతం స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. ‘‘376 ఫండ్ మేనేజర్లకు గాను 30 మందే మహిళలు ఉన్నారు. వీరు ప్రైమరీ లేదా సెకండరీ ఫండ్ మేనేజర్లుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌కు సేవలు అందిస్తున్నారు. గతేడాది మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య 28. మొత్తం 19 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలో 30 మంది మహిళా ఫండ్ మేనేజర్లు పనిచేస్తున్నారు. వీరి కాల వ్యవధిని పరిశీలిస్తే.. 10 మంది గడిచిన ఐదేళ్లుగా నిలకడగా ఫండ్స్ నిర్వహణ చూస్తున్నారు. మరో 12 మంది మూడు నుంచి ఐదేళ్లుగా ఫండ్స్ నిర్వహణ బాధ్యతలో ఉన్నారు. ఇక 8 మంది మహిళా ఫండ్ మేనేజర్ల కాల వ్యవధి చాలా తక్కువగానే ఉంది’’ అని మార్నింగ్ స్టార్ నివేదిక వివరించింది. 2021 జనవరి నాటికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఇన్వెస్టర్ల ఆస్తులు రూ.30.50 లక్షల కోట్లకు వృద్ధి చెందిన విషయం తెలిసిందే. ‘‘మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2017లో మార్నింగ్ స్టార్ నివేదికను విడుదల చేసే నాటికి మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య 18గా ఉంది. 2018లో 24కు, 2019లో 29కు చేరుకోగా, 2020లో 28.. 2021 నాటికి 30కు చేరుకుంది. 8 శాతం మంది మహిళా మేనేజర్లు అంటే మ్యూచు వల్ ఫండ్స్ పరిశ్రమలో చాలా తక్కువ ప్రాతినిధ్యమే’’ అని మార్నింగ్ స్టార్ నివేదిక పేర్కొంది. -
వెంచర్ నిర్వాహకులపై టీడీపీ నేతల దాడి
సాక్షి, కంతేరు(తాడికొండ): ప్రైవేటు వెంచర్ నిర్వాహకులపై టీడీపీ నాయకులు దాడి చేసిన ఘటన తాడికొండ మండలం కంతేరు శివారు కండ్రిక చెరువు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రైవేటు వెంచర్‌కు నల్లమట్టిని తరలించేందుకు కండ్రిక చెరువులో ప్రొక్లెయిన్, ఆరు ట్రాక్టర్లు చేరుకొని శనివారం రాత్రి తవ్వకాలు ప్రారంభించాయి. విషయం తెలుసుకున్న కంతేరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త తోకల నాగభూషణంతో పాటు అతని అనుచరులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. వాహనాలను అడ్డగించి ఆరు ట్రాక్టర్లతో పాటు డ్రైవర్లు, వెంచర్ సూపర్వైజర్ను పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లి నిర్భందించారు. వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులే మట్టిని తరలించారని చెప్పాలంటూ ఫోన్లలో వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ వికృతంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంపై 100 నంబరుకు ఫోన్ వెళ్లడంతో స్పందించిన పోలీసులు వెంటనే కంతేరు గ్రామానికి చేరుకొని నిర్బంధంలో ఉన్న వ్యక్తులను విడిపించి ఠాణాకు తీసుకొచ్చారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆరు ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్లను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అలాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ అక్రమంగా నిర్బంధించి ట్రాక్టరు డ్రైవర్లు, వెంచర్ సూపర్ వైజర్‌ను కొట్టిన ఘటనలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సర్పంచ్ భర్త తోకల నాగభూషణం, కర్రి పాల్‌బాబు, తిరుమలరావు, బండారు కోటేశ్వరరావు, జెట్టి తిరుమలరావు మరి కొంతమందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ రాజశేఖర్ తెలిపారు. వైఎస్సార్ సీపీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు తాడికొండ: కంతేరు గ్రామంలో జరిగిన మైనింగ్ వ్యవహారంలో ట్రాక్టరు డ్రైవర్లు, ప్రైవేటు వెంచర్ సూపర్ వైజర్‌ను టీడీపీ నాయకులు నిర్బంధించి వైఎస్సార్ సీపీ నాయకులే మట్టి తవ్వకాలు చేశారని చెప్పాలంటూ ఒత్తిడి తీసుకొచ్చిన వీడియోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఘటనపై వైఎస్సార్ సీపీ తాడికొండ మండల అధ్యక్షుడు తియ్యగూర బ్రహ్మారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఎస్ఐ సీహెచ్.రాజశేఖర్‌కు చూపించారు. తనకు, పార్టీకి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేసిన కంతేరు గ్రామ టీడీపీ నాయకులు జెట్టి తిరుమలరావు, బండారు కోటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మీడియా మేనేజర్ ఉద్యోగం : రూ.26 లక్షల జీతం
బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ : బ్రిటిష్ రాజ కుటుంబం భారీ వేతనంతో సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్వీన్ ఎలిజబెత్ -2 ఉనికిని మరింత గొప్పగా ఫోకస్ చేసే ఉద్దేశంతో ఈ జాబ్‌ను ఆఫర్ చేస్తోంది. సోషల్ మీడియా మేనేజర్ కావాలంటూ ది బ్రిటీష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ తన జాబ్ లిస్టింగ్ వెబ్సైట్లో పేర్కొంది. ఈ మేరకు కొత్తగా ఎంపిక కాబోయే మీడియా మేనేజర్ రాణిగారిని కొత్తగా సోషల్ మీడియాలో ప్రెజెంట్ చేయాల్సి వుంటుంది. అందుకు సంబంధించిన సరికొత్త మార్గాలను అన్వేషించాలి. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీకి మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకువాలి. వేతనం : 30వేల బ్రిటీష్ పౌండ్లు అంటే సుమారు రూ. 26,57,655 (26.5 లక్షలు). పనిగంటలు: వారానికి 37.5 గంటలు (సోమవారం నుంచి శుక్రవారం వరకు) ఇతర ప్యాకేజీలు జీతంలో 15 శాతం పెన్షన్ పథకం (6 నెలల తర్వాత). 33 రోజుల వార్షిక సెలవు (బ్యాంకు సెలవుతో కలిపి). ఉచిత భోజనం. దీంతోపాటు మీ వృత్తిపరమైన నిరంతర అభివృద్ధికి శిక్షణ ఇవ్వడం. అర్హతలు : డిగ్రీతోపాటు వెబ్సైట్లో పనిచేసిన అనుభవం, అద్భుతమైన ప్లానింగ్ ఫోటోగ్రఫీ , వీడియో నైపుణ్యాలు చాలా అవసరం. ప్రాధాన్యతలను బట్టి చురుకుగా స్పందించాలి. డిజిటల్, సోషల్ మీడియా కంటెంట్‌ను క్రియేట్ చేయాలి. లేటెస్ట్ డిజిటల్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్స్ మీద పూర్తిగా పట్టు వుండాలి. సృజనాత్మక నైపుణ్యం మెండుగా ఉండాలి. డిజిటల్ కంటెంట్ రూపకల్పనలో నైపుణ్యంతోపాటు, రైటింగ్, ఎడిటోరియల్ స్కిల్స్ ఉండాలి. డిజిటల్, సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫాంలలో రోజువారీ వార్తా విశేషాలను, ఫీచర్ కథనాలను నిశితంగా గమనించాలి, పరిశోధించాలి. తద్వారా వివిధ ఆడియెన్స్ గ్రూపులను మీడియా మేనేజర్‌గా ఆకర్షించాలన్నమాట. -
ఫండ్ వ్యాపారానికి డీహెచ్ఎఫ్ఎల్ గుడ్‌బై
ముంబై: డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా అసెట్ మేనేజర్స్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారం నుంచి వైదొలగుతున్నట్లు గృహ రుణాల సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) వెల్లడించింది. జాయింట్ వెంచర్లో తమకున్న మొత్తం వాటాలను భాగస్వామి ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్‌కు విక్రయిస్తున్నామని, డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా ట్రస్టీస్ నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటున్నామని పేర్కొంది. 2015లో ఫండ్ వ్యాపారంలో 50 శాతం వాటాలను డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలు చేసింది. ఇందులో 17.12 శాతం వాటాలు నేరుగా, 32.88 శాతం అనుబంధ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ అడ్వైజరీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఉన్నాయి. మరోవైపు, డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా ట్రస్టీస్‌లో కూడా 50 శాతం వాటాలున్నాయి. వాటాల విక్రయానికి సంబంధించి ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్‌లో భాగమైన పీజీఎల్హెచ్ ఆఫ్ డెలావేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డీహెచ్ఎఫ్ఎల్ అసెట్ మేనేజర్స్ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.129.74 కోట్ల ఆదాయం, రూ.7.76 కోట్ల లాభం ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.109.67 కోట్లు కాగా.. లాభం రూ. 7.64 కోట్లు. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ.. ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్తో కలిసి డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్ పేరిట జీవిత బీమా సంస్థను కూడా ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్‌లో ఈ జాయింట్ వెంచర్ సంస్థలో ప్రుడెన్షియల్ తన వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకుంది. దేశీయంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు తీవ్రంగా నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫండ్ వ్యాపారం నుంచి డీహెచ్ఎఫ్ఎల్ తప్పుకోనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ఎఫ్ఎస్) డిఫాల్ట్‌తో మొదలైన ఈ నిధుల సంక్షోభం పలు ఎన్బీఎఫ్సీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక సంస్థల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. సెప్టెంబర్ నుంచి చూస్తే డీహెచ్ఎఫ్ఎల్ షేర్లు ఏకంగా 68% క్షీణించాయి. మంగళవారం ఎన్ఎస్ఈలో రూ. 213.90 వద్ద క్లోజయ్యాయి. -
అభి మీ సేవా.. మోసాలు ఇంకెన్నో!
భీమవరం టౌన్: పట్టణంలో అభి మీ సేవ నిర్వాహకుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ల్యాండ్ కన్వర్షన్ నిమిత్తం అభి మీ సేవకు వెళ్లిన 9 మంది రైతులకు రూ.33,33,815 టోకరా వేయగా తాజాగా మరో వ్యక్తి రూ.79 వేలు తాను చెల్లించి మోసపోయినట్లు రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తు కూడా అభి మీ సేవ నిర్వాహకులు చేయకపోవడంతో సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్లోకి ఇందుకు సంబంధించిన వివరాలు చేరలేదు. ఇలా ఇంకా ఎన్ని మోసాలు అభి మీ సేవలో జరిగాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మీ సేవ ఆపరేటర్ విటాల గంగాధరరావు, నిర్వాహకుడు చేబ్రోలు వెంకటేష్‌లపై ఇప్పటికే భీమవరం తహసీల్దార్ చవ్వాకుల ప్రసాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం గోల్మాల్ ఆపరేటర్ విటాల గంగాధరరావు చేసినట్లుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన గంగాధరరావు భీమవరం బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటూ మీసేవ నడుపుతున్నాడు. గతేడాది ఆగస్టు నెలలో తొలిసారిగా ల్యాండ్ కన్వర్షన్ నిమిత్తం వచ్చిన రైతుకు టోకరా వేశాడు. అదే నెలలో ఆ తర్వాత ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నాటికి సీఎఫ్ఎంఎస్ ఆధారాల ప్రకారం 9 మంది రైతులు రూ.37,33,815 నగదు చెల్లించగా కేవలం రూ.3,419 మాత్రమే వీరందరి పేరిట ఆ వెబ్సైట్లో జమ కనిపిస్తోంది. ఏడాది కాలంగా నెమ్మదిగా అభి మీ సేవా మోసాలు ప్రారంభమయినా రెవెన్యూ యంత్రాంగం పసిగట్టలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. సంబంధిత వీఆర్వోకు సన్నిహితంగా మెలుగుతూ నమ్మకంగా రైతులను గంగాధరరావు ముంచేసినట్లు తెలుస్తోంది. ల్యాండ్ కన్వర్షన్ నిమిత్తం వచ్చిన రైతులను ఆ వీఆర్వో అభి మీసేవకు నమ్మకంతో పంపగా ఆ నిర్వాహకులు నట్టేట ముంచారు. మీ సేవ నిర్వాహకుడు పాలకోడేరు మండలం మోగల్లుకు చెందిన చేబోలు వెంకటేష్ కూడా నమ్మకంతో గంగాధరరావుకు బాధ్యతలు అప్పగించడంతో కేసులో ఇరుక్కున్నాడు. వెంకటేష్ మోగల్లులో శ్రీవెంకటేశ్వర మీ సేవ కూడా నిర్వహిస్తున్నాడు. కాగా ఈనెల 11వ తేదీన తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అభి మీసేవ గోడకు నోటీసును అతికించారు. 24 గంటల్లో హాజరుకావాలని అందులో పొందు పరిచినా గంగాధరరావు పరారయ్యాడు. దీంతో తహసీల్దార్ చవ్వాకుల ప్రసాద్ ఫిర్యాదుతో మీసేవ కార్యకలాపాలను నిలిపివేశారు. బ్యాంక్ కాలనీలోని గంగాధరరావు అద్దెకు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అతికించారు. ఇది ఇలా ఉండగా కొందరు రైతులను తీసుకుని వీఆర్వో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని గంగాధరరావు స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియచేశారు. అతని తండ్రి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అతను సొమ్ము అందేలాగా చూస్తానని రైతులకు, వీఆర్వోకు చెప్పినట్లు తెలిసింది. -
అత్యధిక వేతనాలు పొందింది వారే!
న్యూఢిల్లీ : మీ అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుంది, మీ అబ్బాయి ఏం పనిచేస్తున్నాడు. జీతం ఎంత ఇస్తున్నారేంటి? ఇలా చుట్టుపక్కల వారి ప్రశ్నలు అన్నీఇన్నీ కావు. ఎంత సంపాదిస్తున్నావేంటి? అనుకుంటూ పక్కింటి వాళ్లు, ఎదురింటోళ్లు వేసే ప్రశ్నలు చాలా మందికి పెద్ద తలనొప్పి. అయితే భారత్‌లో కొన్ని వృత్తులు చేపట్టేవారికి మాత్రమే వేతనాలు అత్యధికంగా ఉన్నాయంట. అవి ఎవరికో తెలుసా? చట్ట సభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్లు. వీరికి మాత్రమే సగటు రోజూ వారీ చెల్లించే వేతనాలు 1993-94 నుంచి 2011-12 వరకు రెండింతలు అయ్యాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) ఇండియా వేతన రిపోర్టు పేర్కొంది. అన్ని కేటగిరీల వృద్ధిలో చట్ట సభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్లు మాత్రమే తమ వేతనాలను 98 శాతం పెంచుకున్నారని తెలిపింది. అదేవిధంగా నిపుణుల వేతనాలు 90 శాతం పెరిగినట్టు రిపోర్టు పేర్కొంది. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ డేటాను పరిశీలించిన తర్వాత, ఐఎల్ఓ ఈ రిపోర్టును విడుదల చేసింది. మరోవైపు స్పెక్ట్రమ్, ప్లాంట్, మిషన్ ఆపరేటర్లు మాత్రమే గత రెండు దశాబ్దాలుగా అత్యంత తక్కువ వేతనాలను పొందుతున్నారని రిపోర్టు వెల్లడించింది. వీరి వేతనాలు కేవలం 44 శాతం మాత్రమే పెరిగాయని తెలిపింది. మొత్తంగా వేతనాల పెంపు గత 18 ఏళ్లలో సగటున 93 శాతం ఉందని తెలిపింది. అత్యధికంగా వేతనం చెల్లించే ఉద్యోగానికి, తక్కువ వేతనం చెల్లించే ఉద్యోగానికి తేడాను కూడా రిపోర్టు వివరించింది. 1993-94లో వీటి మధ్య తేడా 7.2 శాతముంటే, 2004-05లో 10.7 శాతానికి పెరిగిందని, అయితే 2011-12లో అది 7.6 శాతానికి తగ్గినట్టు పేర్కొంది. తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగుల రోజువారీ వేతనాలు 2004-05 నుంచి 2011-12 మధ్యలో 3.7 శాతం పెరిగినట్టు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో వేతనాలు స్థిరంగా కొనసాగుతున్నాయని చెప్పింది. పే కమిషన్ కేవలం ప్రభుత్వ రంగ రంగాల్లో వేతనాల పెంపును మాత్రమే కాక, ప్రైవేట్ రంగపు వేతనాలపై కూడా ప్రభావం చూపినట్టు రిపోర్టు నివేదించింది. -
కోర్టుకు వెళ్లిన ‘సన్నీ నైట్స్’ నిర్వాహకులు
సాక్షి,బెంగళూరు: డిసెంబర్ 31న సన్నీలియోన్ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించా రు. కార్యక్రమానికి రూ. లక్షలు ఖర్చు చేశామని, అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. వీరి పిటిషన్ మరో రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
విప్రోలో ఎంతమందిని తొలగిస్తున్నారో తెలుసా?
దేశంలోని మూడో అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ విప్రో ఉద్యోగులపై ఉద్వాసన కత్తి వేలాడుతున్న సంగతి తెలిసిందే. పనితీరు సరిగా కనబర్చని ఉద్యోగులపై ఏ క్షణంలోనైనా వేటు వేసే పరిస్థితి నెలకొంది.అయితే ఎంతమందిపై ఉద్వాసన వేటు వేయనుందో ఇప్పటివరకు స్పష్టంగా తెలియనప్పటికీ, కంపెనీలోని కొంతమంది మేనేజర్లు చెప్పిన డేటా ఆధారంగా మొత్తం వర్క్ ఫోర్స్ లో 10 శాతం మందిని విప్రో తొలగించనుందని వెల్లడైంది. పనితీరు సరిగా కనబర్చని(పూర్ ఫర్ ఫార్మెన్స్) వారిని కంపెనీ తీసేవేయనుందని మేనేజర్లు చెప్పారు. బీ10(బోటమ్ 10 శాతం) కోడ్ నేమ్ తో ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రారంభించనట్టు తెలిసింది. ఏప్రిల్ తో ముగిసిన అప్రైసల్స్ తో బోటమ్ 10 శాతం మందిని గుర్తించాలని హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ ఆదేశించిందని మేనేజర్లు తెలిపారు. ఈ విషయంపై కంపెనీని ఆశ్రయించగా, ఈ డెవలప్ మెంట్ ను ఖండించింది. ఈ రూమర్లకు ఎలాంటి ఆధారాలు లేవని కంపెనీ ఈ మెయిల్ రెస్పాన్స్ లో తెలిపింది. అయితే మనీకంట్రోల్ సంప్రదించిన కంపెనీకి చెందిన చాలామంది మేనేజర్లు 10 శాతం ఉద్యోగాల కోతను ధృవీకరించారు. 5కు 2 రేటింగ్ ఇచ్చిన వారందరూ బోటమ్ 10 శాతంలోకి వస్తారని మేనేజర్లు తెలిపారు. ఈ ప్రభావం కేవలం భారత్ ఉద్యోగులపైనే కాక, విదేశాల్లో పనిచేస్తున్న వారిపై కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఆటోమేటెడ్ ప్రభావంతో విప్రో మూడేళ్లలో 47వేల మందిని తగ్గించుకోనుందని 2015లోనే మాజీ సీఈవో టీకే కురియన్ ఓ సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం విప్రోలో 1.8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
బ్యాంకుల మెడకు ఆర్బీఐ ఉచ్చు
తణుకు : బ్యాంకు అధికారుల మెడకు ఆర్బీఐ ఉచ్చు బిగుసుకుంటోంది. తణుకు ఎస్బీఐ కేంద్రంగా సాగిన అక్రమ లావాదేవీలు ఇటీవల వెలుగు చూడగా.. కీలక బాధ్యుడిగా భావించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై వేటు వేసిన ఆర్బీఐ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. సోమవారం తణుకు పట్టణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. 5 బృందాలుగా విడిపోయి సోమవారం వేకువజామునుంచి సోదాలు చేపట్టారు. కొందరు బ్యాంకు మేనేజర్లు ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఒక బ్యాంక్ మేనేజర్ నివాసంలో అధికారులు గంటల కొద్దీ సోదాలు నిర్వహించి వారినుంచి వాంగ్మూలం సేకరించారు. బొమ్మల వీధిలో నివాసం ఉంటున్న మరో బ్యాంకు మేనేజర్ నివాసంలోనూ తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆయనను తమతో తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. తణుకు ఎస్బీఐ శాఖలోని కొందరు సిబ్బందిని సైతం సోమవారం పొద్దుపోయేవరకు విచారించినట్టు తెలుస్తోంది. సోదాలకు వచ్చిన అధికారులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. -
సుజాత హోటల్ నిర్వాహకులపై కేసు
అనంతపురం సెంట్రల్ : తినుబండారాలను అధికధరలకు విక్రయిస్తున్న సుజాత హోటల్‌పై కేసు నమోదు చేసినట్లు తూనికలు కొలతలుశాఖ సీఐ శంకర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు గురువారం నగరంలో పలు హోటళ్ళపై దాడులు నిర్వహించామన్నారు. డీఈఓ కార్యాలయం సమీపంలోని సుజాతహోటల్‌లో పకోడ, మిశ్చర్ తదితర వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. నిబంధనల మేరకు రేట్ల పట్టిక వేయాల్సి ఉన్నా, సదరు నిర్వాహకులు ఏర్పాటు చేయకపోవడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే సప్తగిరి సర్కిల్లోని ప్రశాంతి హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా, అధిక రేట్లకు వాటర్‌బాటిల్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. రైల్వే స్టేషన్లలో విక్రయించాల్సిన వాటర్‌బాటిల్స్‌ను తెప్పించినట్లు తేలిందన్నారు. దీంతో సదరు హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
సుజాత హోటల్ నిర్వాహకులపై కేసు
అనంతపురం సెంట్రల్ : తినుబండారాలను అధికధరలకు విక్రయిస్తున్న సుజాత హోటల్‌పై కేసు నమోదు చేసినట్లు తూనికలు కొలతలుశాఖ సీఐ శంకర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు గురువారం నగరంలో పలు హోటళ్ళపై దాడులు నిర్వహించామన్నారు. డీఈఓ కార్యాలయం సమీపంలోని సుజాతహోటల్‌లో పకోడ, మిశ్చర్ తదితర వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. నిబంధనల మేరకు రేట్ల పట్టిక వేయాల్సి ఉన్నా, సదరు నిర్వాహకులు ఏర్పాటు చేయకపోవడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే సప్తగిరి సర్కిల్లోని ప్రశాంతి హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా, అధిక రేట్లకు వాటర్‌బాటిల్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. రైల్వే స్టేషన్లలో విక్రయించాల్సిన వాటర్‌బాటిల్స్‌ను తెప్పించినట్లు తేలిందన్నారు. దీంతో సదరు హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
బ్యాంకు మేనేజర్లు బుక్కయ్యారు..
ముంబై: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పాత సామెత అయినప్పటికీ దీనికి పక్కాగా ఫాలో అవుతున్నారు కొందరు అక్రమార్కులు. పెద్దనోట్ల రద్దుతో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని డబ్బు ఉన్నవారి పునాదులు కదులుతున్న నేపథ్యంలో.. అవకాశం ఉన్నప్పుడే అందినకాడికి వెనకేసుకోవాలని వారు చూస్తున్నారు. మరి ఈ అక్రమార్కులు ఏకంగా బ్యాంకుల్లో కీలక నిర్ణయాలు తీసుకునేవారైతే ఇక వారికి అడ్డేముంటుంది. ముంబైలో ఇద్దరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్లను మనీ లాండరింగ్ కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బడాబాబుల లెక్కల్లో లేని డబ్బును సెటిల్ చేయడంలో వీరి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇద్దరు బ్యాంకు మేనేజర్లను సస్పెండ్ చేస్తూ యాక్సిస్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దును కొంత మంది బ్యాంకు అధికారులు బాగా క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బ్యాంకు అధికారులపై ప్రత్యేక నిఘా ఉంచారని తెలుస్తోంది. -
‘అమ్మ ఒడి’కి తల్లి
చిత్తూరు ఆశ్రమానికి తరలించిన నిర్వాహకులు లభించని వృద్ధురాలి వివరాలు బి.కొత్తకోట: నాలుగు రోజులుగా బి.కొత్తకోట మండలంలోని శంకరాపురంలో రోడ్డుపై పడి ఉన్న 95 ఏళ్ల వృద్ధురాలి కథనంపై చిత్తూరు అమ్మ ఒడి సేవాశ్రమ నిర్వాహకులు స్పందించారు. ఆదివారం వృద్ధురాలి దీనావస్థపై సాక్షిలో ప్రచురితమైన కథనం పలువురిని కలచివేసింది. ఆదివారం సాయంత్రం అమ్మ ఒడి సేవాశ్రమ వ్యవస్థాపకులు పి.పద్మనాభనాయుడు సిబ్బందితో కలిసి అంబులెన్స్‌లో శంకరాపురం చేరుకున్నారు. వృద్ధురాలితో మాట్లాడే ప్రయత్నం చేశారు. తడారిన గొంతులోంచి మాట పెగలకపోయినా బలవంతంగా అరిచింది. అంబులెన్స్‌లోకి చేర్చేం దుకు పైకి లేపబోతే వదలండంటూ సిబ్బంది చేతులను విదిలించింది. ఆస్పత్రికి తీసుకెళతామని చెబుతుంటే శరీరంలోని శక్తినంతటినీ కూడదీసుకుని రానంటూ మొండికేసింది. స్ట్రెచ్చర్‌పై పడుకోబెట్టి అంబులెన్స్‌లోకి ఎక్కిస్తుండగా ఒక దశలో కేకలు పెట్టింది. పాపం ఆ వృద్ధురాలు ఏం చెప్పాలని ప్రయత్నిస్తుందో, ఆమె గోడు ఎవరికీ అర్థం కాలేదు. చివరకు అంబులెన్స్‌లో చిత్తూరుకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ప్రసాద్, అమ్మ ఒడి కో-ఆర్డినేటర్ ఎన్.షబీనాబేగం, సిబ్బంది కే.మణివణ్ణన్, ఆర్.ప్రకాష్, కేవీ.లోకేష్ ఉన్నారు. మేం చూసుకుంటాం.. వృద్ధురాలికి ఏ ఇబ్బందీ లేకుండా తాము చూసుకుంటామని అమ్మ ఒడి వ్యవస్థాపకులు పి.పద్మనాభనాయుడు విలేకరులకు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితుల్లోని 66 మందిని ఆశ్రమంలో ఉంచామని, ఈమె 67 అని అన్నారు. లభించని వివరాలు.. శంకరాపురంలో వదిలేసిన వృద్ధురాలి వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు. శనివారం ఆమెది అనంతపురం జిల్లా తనకల్లుగా ప్రచారం జరిగింది. ఆదివారం ఏఎస్ఐ ప్రసాద్ వృద్ధురాలిని వివరాలు అడగ్గా కర్ణాటకలోని చేలూరు ప్రాంతమని ఒకసారి, కోటూరు అని మరోసారి చెప్పింది. దీంతో కచ్చితంగా ఏ ప్రాంతానికి చెందిందో తేలలేదు. -
మీసేవ.. మా ఇష్టం!.
కేంద్రాల్లో అనర్హులు - కేటాయింపులో నిబంధనలు బేఖాతరు - బినామీల నిర్వహణతో అస్తవ్యస్తం - పల్లెల పేరిట మంజూరు.. పట్టణాల్లో ఏర్పాటు - 60 కేంద్రాల్లో ఒక్క కంప్యూటరే దిక్కు - సేవల్లో జాప్యంతో ప్రజల బేజారు కర్నూలు(కలెక్టరేట్): మీసేవ కేంద్రాల్లో బినామీలు పాగా వేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉద్దేశించిన ఈ కేంద్రాల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 287 మీసేవ కేంద్రాలను నిర్వహిస్తుండగా అధిక శాతం ఎలాంటి అర్హత లేని వ్యక్తుల చేతుల్లో ఉండటం గమనార్హం. పలుకుబడి.. పైరవీలతో దక్కించుకున్న కేంద్రాలను చాలా మంది లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన నిరుద్యోగులకే వీటిని కేటాయించాల్సి ఉంది. అయితే 10వ తరగతి చదివి కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం లేని వ్యక్తులకు సైతం మీసేవ కేంద్రాలను కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హెచ్‌సీఎల్‌కు సంబంధించి అర్బన్‌లో 12, ఇతర ప్రాంతాల్లో 54 కేంద్రాలు ఉండగా.. 10 సెంటర్లను బినామీలకు కట్టబెట్టారు. సీఎంఎస్ నిర్వహణలోని మీసేవ కేంద్రాలు 178 ఉండగా.. 50 వరకు ఇతరుల చేతుల్లో ఉన్నట్లు సమాచారం. ఏపీ ఆన్‌లైన్‌కు సంబంధించిన కేంద్రాలు 55 ఉండగా.. సగం వరకు బినామీలే నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మీసేవ కేంద్రాలు ఏ గ్రామానికి మంజూరైతే అక్కడే ఏర్పాటు చేయాలనే నిబంధనను కాలరాశారు. గ్రామాల పేరుతో అనుమతి పొంది పట్టణాల్లో నిర్వహిస్తుండటంతో గ్రామీణులకు నిరాశే ఎదురవుతోంది. ఆదోని మండలంలోని సాదాపురం, బసాపురం గ్రామాలకు మీసేవ కేంద్రాలు మంజూరు కాగా.. వీటిని ఆదోని పట్టణంలో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలాంటి అక్రమాలు అనేకం చోటు చేసుకున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇక మీసేవ కేంద్రాల్లో తగినంత మంది ఆపరేటర్లను నియమించకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. హెచ్‌సీఎల్‌కు చెందిన అర్బన్ కేంద్రాల్లో పని ఒత్తిడి అధికంగా ఉన్నా అందుకు తగినట్లుగా ఆపరేటర్లను నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ఆన్లైన్, సీఎంఎస్ సెంటర్లలోనూ తగినన్ని కంప్యూటర్లు లేకపోవడంతో సేవల్లో జాప్యం జరుగుతోంది. ఒకే సిస్టంతో పని చేస్తున్న మీసేవ కేంద్రాలు జిల్లాలో 60 వరకు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
తప్పుడు రిపోర్టులతో ప్రజలను భయపెట్టొద్దు
దేవునిపల్లి, న్యూస్‌లైన్ :చాలామంది డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, వ్యాధులు లేకున్నా పాజిటివ్ రిపోర్టులు ఇస్తున్నారని కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎస్పీహెచ్ఓ సురేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీజనల్ వ్యాధుల రక్త పరీక్షలను తప్పుడుగా చేస్తున్నారని, నిర్ధారించుకోకుండానే రిపోర్టులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పట్టణంలోని ల్యాబ్స్, డయాగ్నోస్టిక్స్ నిర్వాహకులతో సోమవారం ఆర్డీఓ చాంబర్లో సమావేశం నిర్వహించారు. డెంగ్యూ రక్త పరీక్షలు చేయడానికి ఇక్కడ సౌకర్యాలు లేవని, అలాంటప్పుడు ఎలా పాజిటివ్‌గా రిపోర్ట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా తప్పుడు రిపోర్ట్‌లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని హెచ్చరించారు. డెంగ్యూకు సంబంధించినా ఎలిజా మెథడ్ రక్తపరీక్షల కోసం రక్తం నమూనాలను జిల్లా కేంద్రానికి పంపించి, పరీక్ష అనంతరం నిర్ధారణ చేసుకుని రిపోర్ట్‌లను రోగులకు అందజేయాలని స్పష్టంచేశారు. పరీక్షలు సరిగా నిర్వహించకుండా తప్పుడు రిపోర్టులు అందించే ల్యాబ్‌లను సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో సబ్యూనిట్ ఆఫీసర్ బాల్‌చంద్రం, సూపర్వైజర్ చలపతి, ల్యాబ్‌ల నిర్వాహకులు పాల్గొన్నారు.