![Bayer plans to cut middle managers and give employees flexibility - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/14/Bayer.jpg.webp?itok=Nt6tZdeI)
జర్మన్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం బేయర్ వినూత్న ప్రణాళిక రచించింది. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. బేయర్ కొన్ని నిర్మాణాత్మక మార్పులు చేస్తోంది. కార్పొరేట్ బ్యూరోక్రసీని తగ్గించడం, ఉద్యోగులకు ఎక్కువ స్వయంప్రతిపత్తి కల్పించడం, వ్యాపారాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించేలా చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం.
కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిల్ ఆండర్సన్ దీనికి "డైనమిక్ షేర్డ్ ఓనర్‌షిప్" అని పేరు పెట్టారు. కంపెనీ నిబంధనలకు సంబంధించి 1,300 జీలకుపైగా ఉన్న లిటరల్ కార్పొరేట్ రూల్‌బుక్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇది 'వార్ అండ్ పీస్' పుస్తకం కంటే ఎక్కువగా ఉందని చమత్కరించారు. మిడిల్ మేనేజర్‌లను తగ్గించి, ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడంలో ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని యోచిస్తున్నట్లు బిల్ ఆండర్సన్ తెలిపారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఈ కొత్త వ్యవస్థ గురించి గురించి న్యూజెర్సీలో కొంతమంది ఉద్యోగులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. నూతన ప్రణాళికలో భాగంగా తొలగించనున్న మేనేజర్ల సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. అయితే యూఎస్‌కు చెందిన వేలాది మంది మేనేజర్‌లకు కంపెనీ ఇతర ఉద్యోగాలు కేటాయించనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
బేయర్స్ సీఈవో అండర్సన్ ప్రతిపాదన కంపెనీ సంస్థాగత ఖర్చులను సుమారు 2 బిలియన్ యూరోలు తగ్గిస్తుందని జర్మన్ కార్పొరేషన్ మార్చిలో పేర్కొంది. గత సంవత్సరంలో బేయర్ షేర్లు 60.40 యూరోల నుండి 27.64 యూరోలకు 50 శాతానికి పైగా పడిపోయాయి. కంపెనీ సుమారు 34 బిలియన్ యూరోల రుణంపై నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment