విప్రోలో ఎంతమందిని తొలగిస్తున్నారో తెలుసా?
విప్రోలో ఎంతమందిని తొలగిస్తున్నారో తెలుసా?
Published Mon, May 22 2017 3:31 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
దేశంలోని మూడో అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ విప్రో ఉద్యోగులపై ఉద్వాసన కత్తి వేలాడుతున్న సంగతి తెలిసిందే. పనితీరు సరిగా కనబర్చని ఉద్యోగులపై ఏ క్షణంలోనైనా వేటు వేసే పరిస్థితి నెలకొంది.అయితే ఎంతమందిపై ఉద్వాసన వేటు వేయనుందో ఇప్పటివరకు స్పష్టంగా తెలియనప్పటికీ, కంపెనీలోని కొంతమంది మేనేజర్లు చెప్పిన డేటా ఆధారంగా మొత్తం వర్క్ ఫోర్స్ లో 10 శాతం మందిని విప్రో తొలగించనుందని వెల్లడైంది. పనితీరు సరిగా కనబర్చని(పూర్ ఫర్ ఫార్మెన్స్) వారిని కంపెనీ తీసేవేయనుందని మేనేజర్లు చెప్పారు. బీ10(బోటమ్ 10 శాతం) కోడ్ నేమ్ తో ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రారంభించనట్టు తెలిసింది. ఏప్రిల్ తో ముగిసిన అప్రైసల్స్ తో బోటమ్ 10 శాతం మందిని గుర్తించాలని హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ ఆదేశించిందని మేనేజర్లు తెలిపారు.
ఈ విషయంపై కంపెనీని ఆశ్రయించగా, ఈ డెవలప్ మెంట్ ను ఖండించింది. ఈ రూమర్లకు ఎలాంటి ఆధారాలు లేవని కంపెనీ ఈ మెయిల్ రెస్పాన్స్ లో తెలిపింది. అయితే మనీకంట్రోల్ సంప్రదించిన కంపెనీకి చెందిన చాలామంది మేనేజర్లు 10 శాతం ఉద్యోగాల కోతను ధృవీకరించారు. 5కు 2 రేటింగ్ ఇచ్చిన వారందరూ బోటమ్ 10 శాతంలోకి వస్తారని మేనేజర్లు తెలిపారు. ఈ ప్రభావం కేవలం భారత్ ఉద్యోగులపైనే కాక, విదేశాల్లో పనిచేస్తున్న వారిపై కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఆటోమేటెడ్ ప్రభావంతో విప్రో మూడేళ్లలో 47వేల మందిని తగ్గించుకోనుందని 2015లోనే మాజీ సీఈవో టీకే కురియన్ ఓ సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం విప్రోలో 1.8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Advertisement
Advertisement