పుష్కర భక్తులకు వడదెబ్బ
పుష్కర భక్తులకు వడదెబ్బ
Published Mon, Aug 15 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
ఏడుగురు బాధితులకు వైద్యం
నాలుగోరోజు శిబిరాల్లో 15,136 మందికి వైద్యం
గుంటూరు మెడికల్: జిల్లాలో ఈ నెల 12 నుంచి జరుగుతున్న కృష్ణాపుష్కరాల్లో ఒక పక్క డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. దీనికితోడు సోమవారం వడదెబ్బ కేసులు కూడా నమోదవటంతో భక్తుల్లో భయం మరింత తీవ్రంగా పెరిగింది. పుణ్యస్నానమాచరించటానికి వస్తే వివిధ రకాల రోగాలు (అంటురోగాలు) వ్యాపిస్తూ ఉండటంతో వైద్యాధికారులు అప్రమత్తమై క్యాంపుల్లో వైద్యసేవలను అందించటంతోపాటుగా అప్రమత్తంగా ఉండాలని భక్తులకు కరపత్రాలు అందించటం, మైక్‌లలో ప్రచారం చేయటం ద్వారా ముందస్తు జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. సన్‌స్ట్రోక్( వడదెబ్బకు) గురైన ఏడుగురికి జిల్లా వైద్యాధికారులు ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో సేవలను అందించినట్లు అధికారులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న 441 మందికి, వివిధ రకాల ఎలర్జీలతో బాధపడుతున్న 840 మందికి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 2107 మందికి, ఆస్తమాతో బాధపడుతున్న 271 మందికి, కన్ను, చెవి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 488 మందికి, డయేరియాతో బాధపడుతున్న 97 మందికి వైద్యసేవలను అందించినట్లు జిల్లా ౖÐð ద్య ఆరోగ్యశాకాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి వెల్లడించారు.
Advertisement
Advertisement