హై సెక్యూరిటీ ప్లేట్లపై సుప్రీంకు.. | Supreme Court on the High Security plates | Sakshi
Sakshi News home page

హై సెక్యూరిటీ ప్లేట్లపై సుప్రీంకు..

Published Sat, Dec 5 2015 2:22 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

హై సెక్యూరిటీ ప్లేట్లపై సుప్రీంకు.. - Sakshi

హై సెక్యూరిటీ ప్లేట్లపై సుప్రీంకు..

సాక్షి, హైదరాబాద్: హై సెక్యూరిటీ నంబర్‌ప్లేట్లకు విధించిన గడువు ఈ నెల 15వ తేదీన ముగియనున్న దృష్ట్యా మరోసారి గడువు పొడిగింపు కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించేందుకు సన్నద్ధమవుతోంది. హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్లు (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం 2013లో హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్రాజెక్టును ప్రారంభించింది. 2015 డిసెంబర్ 15వ తేదీ నాటికి అన్ని వాహనాలను ఈ పథకం పరిధిలోకి తేనున్నట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. కానీ అమల్లో తీవ్ర జాప్యం నెలకొంది.

రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 6 లక్షల వాహనాలకే హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్లను బిగించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే ఈ స్కీమ్ పరిమితమైంది. హైదరాబాద్‌లోని సుమారు 40 లక్షల  పాతవాహనాలకు ఇప్పటివరకు హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ల ఏర్పాటు మొద లు కాలేదు. దీంతో రాష్ర్టవ్యాప్తంగా సుమారు 75 లక్షల వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ వర్తింపజేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మరోసారి గడువు పొడిగింపును కోరుతూ త్వరలో అఫిడవిట్‌ను సమర్పించనున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement