
లోకేశ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీసీ!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు శనివారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ)లో నిర్వహించారు.
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు శనివారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ)లో నిర్వహించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వీసీ దామోదరం హజరై కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీయూ రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ భాస్కర్, సెనేట్ మెంబర్ డాక్టర్ ఆర్ సుధారాణి, మాజీ వీసీలు రాళ్లపల్లి రామ్మూర్తి, కొలకలూరి ఇనాక్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు ఆనంద్ గౌడ్, హారికృష్ణ యాదవ్, మణికంఠ, లోకనాధం తదితరులు పాల్గొన్నారు.