విశాఖ మెడికల్: విశాఖలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. సోమవారం నగరంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైనట్లు ప్రచారం జరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే దీన్ని అధికారులు ధ్రువీకరించడం లేదు. వివరాల్లోకి వెళితే..
జూన్ 1న నగరంలోని ఇసుకతోటకు చెందిన 53 ఏళ్ల వ్యక్తి స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో సెవెన్‌హిల్స్‌లో చేరాడు. బాధితుడి గొంతు నుంచి సేకరించిన స్రావాలను హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగానికి నిర్థారణ కోసం పంపించారు. సోమవారం నివేదిక రావడంతో నగరంలో కలకలం రేగింది. అయితే నివేదికలో అతనికి స్వైన్‌ఫ్లూ నిర్థారణ కాలేదని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడిస్తుండగా, ఆస్పత్రి వర్గాలు మాత్రం అనుమానిత కేసుగా చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఇంతకుముందు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో మరో ఇద్దరు సెవెన్‌హిల్స్, ఒకరు అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అయితే సెవెన్‌హిల్స్‌లో చేరిన ఇద్దరిలో ఒకరికి స్వైన్‌ఫ్లూ లేనట్లు తేలిందని, మరొకరి రిపోర్టు రావాల్సి ఉందని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దినకర్ తెలిపారు.
విశాఖలో స్వైన్ ఫ్లూ కలకలం
Published Tue, Jun 7 2016 7:57 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement