తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
Published Fri, Aug 5 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
తిప్పర్తి : ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారిపడి గీతకార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని మాడ్గులపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తండు యాదయ్య (46) గీత వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరిగానే తాటి చెట్టు నుంచి కల్లు తేవడానికి ఉదయం వెళ్లాడు. ఈ క్రమంలో కల్లు తేవడానికి వెళ్లిన యాదయ్య రెండు గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తాటిచెట్టు వద్దకు వెళ్లి చూడగా కింద పడి ఉన్నాడు. పరిశీలించి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అందరితో కలుపుగోలుగా యాదయ్య మృతి చెందడంతో ఊరంతా విషాదం చోటు చేసుకుంది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జెడ్పీటీసీ పరామర్శ...
యాదయ్య కుటుంబాన్ని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. తక్షణ సహాయం కింద చంద్రం ఫౌండేషన్ ద్వారా రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుల్లెంల సైదులు తదితరులున్నారు.
Advertisement
Advertisement