బ్రౌచర్‌ను విడుదల చేస్తున్న సీఈఓ, స్వేరోస్ సభ్యులు
అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Published Sat, Aug 27 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
-జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : రాజ్యంగ నిర్మాణ అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ పిలుపునిచ్చారు. స్వేరోస్ నెట్ వర్క్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4వ తేదీన నిర్వహించనున్న అంబేద్కరిజం వర్క్‌షాప్ బ్రౌచర్‌ను శనివారం తన చాంబర్‌లో సీఈఓ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వేరోస్ సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం స్వేరోస్ సెంట్రల్ కమిటీ సభ్యుడు స్వాములు మాట్లాడారు. స్వేరోస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4వ తేదీన షాద్‌నగర్‌లో వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వేరోస్ ప్రతినిధి రామకష్ణ, మూఢ నమ్మకాలుపై నాగేశ్వర్‌రావు, స్వేస్ భావజాలంపై సుధాకర్, విదేశీ విద్యపై రమేష్‌బాబు, దేహదారుడ్యంపై స్వాములు, రాజకీయాలు వెంకట్, కమ్యునిటీ రిలేషన్స్ కష్ణయ్య, వ్యక్తిత్వ వికాసంపై శ్రీనివాసులు, సాఫ్ట్ స్కీల్స్‌పై సురేష్‌లు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా ఐపీఎస్ ప్రవీన్‌కుమార్, జేసీ రాంకిషన్, సీఈఓ లక్ష్మినారాయణ ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు.
Advertisement