పింఛన్లకు సొమ్ములు వసూలు చేస్తే కేసులు | take serious action who take money for fentions | Sakshi
Sakshi News home page

పింఛన్లకు సొమ్ములు వసూలు చేస్తే కేసులు

Published Mon, Oct 24 2016 10:12 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

పింఛన్లకు సొమ్ములు వసూలు చేస్తే కేసులు - Sakshi

పింఛన్లకు సొమ్ములు వసూలు చేస్తే కేసులు

– కలెక్టర్‌ భాస్కర్‌ హెచ్చరిక
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పింఛన్లు మంజూరు చేయిస్తామని కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నట్టు తన దష్టికి వచ్చిందని, సొమ్ములు వసూలు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయిస్తానని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ హెచ్చరించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం మీ కోసం కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్‌ భాస్కర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వికలాంగ, వద్ధాప్య పింఛన్లు మంజూరు చేయిస్తామని కొందరు వద్ధుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. పింఛన్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ చెప్పారు. 
పోలవరం మండలం రామయ్యపేటకు చెందిన మిరాయాల వరలక్ష్మి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తూ వికలాంగుల పింఛన్‌ ఇప్పిస్తామని గ్రామంలో కొందరు సొమ్ములు డిమాండ్‌ చేస్తున్నారని, ఇదివరలో కొందరు డబ్బులు తీసుకుని పింఛన్లు మంజూరు చేశారని, తనకు సొమ్ములివ్వడం ఇష్టం లేక మీ వద్దకు వచ్చానని న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరింది. వికలాంగుల సంక్షేమాధికారి ప్రసాదరావును ఈ ఘటనపై విచారణ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి అభివద్ధి కమిటీ సభ్యులు గూటే దేవానంద్‌ ప్రసాద్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ ఆసుపత్రిలో కొందరు డాక్టర్లు ఉదయం 9 గంటలకు బయోమెట్రిక్‌ హాజరు వేసి వెళ్లిపోయి తిరిగి సాయంత్రం 4 గంటలకు వచ్చి బయోమెట్రిక్‌ హాజరు వేస్తున్నారని చెప్పారు. ఆసుపత్రిలో 15 సంవత్సరాలుగా కొందరు అక్కడే పనిచేస్తున్నారని, రోగులకు సరైన వైద్యం అందించకుండా రోగులను ఏలూరు ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారని చెప్పారు. వెంటనే విచారణ చేయాలని డీసీహెచ్‌ఎస్‌ శంకరరావును కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ షరీఫ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
మా భూమి చూపించండయ్యా
తమ భూమిని తమకు ఇప్పించాలని ఎన్నిసార్లు కోరినా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడేనికి చెందిన వద్ధ దంపతులు వాపోయారు. చొదిమెళ్ల ఏసుదాసు, సువార్త వద్ధ దంపతులకు చెందిన కాస్త భూమిపై సరిహద్దు భూమిలోని వ్యక్తులు హద్దులను తొలగించి కబ్జా చేశారు. దీంతో వద్ధులు గతంలో మీ కోసం కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ గతంలోనే లింగపాలెం మండల తహసీల్దార్‌ను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సదరు తహసీల్దార్‌ కలెక్టర్‌ దగ్గరకు ఎందుకు వెళ్లారంటూ వద్ధులపై ఆగ్రహించి కలెక్టర్‌ ఏం చేస్తారని చెప్పడంతో మరోమారు ఆ వద్ధులు తమ భూమిని తమకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని మీ కోసం కార్యక్రమానికి వచ్చి సమస్యను కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ తక్షణమే వద్ధ దంపతులకు న్యాయం చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement