మంత్రి ఆర్డరేస్తే మేమెందుకు | TDP leader fires on Minister Narayana | Sakshi
Sakshi News home page

మంత్రి ఆర్డరేస్తే మేమెందుకు

Published Sun, Jul 17 2016 10:09 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

మంత్రి ఆర్డరేస్తే మేమెందుకు - Sakshi

మంత్రి ఆర్డరేస్తే మేమెందుకు

  •  విజయవాడలో కూర్చొని నిర్ణయించడం పద్ధతి కాదు 
  •  ఉత్తర్వులు వెనక్కు తీసుకోకుంటే ప్రత్యక్ష ఆందోళన 
  •     మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి
  • నెల్లూరు రూరల్‌:
    ‘ నన్ను సంప్రదించకుండా ఆర్డర్స్‌ వేస్తే మేమెందుకు.. ఆయన విజయవాడలో కూర్చొని ఉత్వర్వులు జారీ చేయడం పద్ధతి కాదు. అవసరమైతే ప్రత్యక్ష పోరుకు సిద్ధం.’ అని మాజీ మంత్రి, టీడీపీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ ఆదాల ప్రభాకర్‌రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణపై మండిపడ్డారు. నగరంలోని ఆయన నివాసంలో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నాయకుల సమన్వయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడారు. నెల్లూరు నగరం సగం రూరల్‌ నియోజకవర్గంలో ఉందని, నగర కార్పొరేషన్‌లో జరిగే కార్యక్రమాలను తమను సంప్రదించకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు. మేయర్‌ను అడిగితే నాకు తెలియదంటారు, కార్పొరేటర్‌ను అడిగితే నాకు సంబంధం లేందంటున్నారన్నారు. నగరంలో అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కూల్చివేయాలని విజయవాడలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయాలని మేయర్‌పై ఒత్తిడి చేయడం తగదన్నారు. టీడీపీ జల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మట్లాడుతూ అభివద్ధి కార్యక్రామల్లో కార్యకర్తలు భాగస్వామ్యం కావాలలన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కషి చేయాలన్నారు. సమావేశంలో మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, విజయడైయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆనం జయకుమార్‌రెడ్డి, అధికార ప్రతినిధి హరిబాబు యాదవ్, టీడీపీ రూరల్‌ కన్వీనర్‌ కిలారీ వెంకటస్వామి నాయుడు, మండల అధ్యక్షుడు చిరమన శ్రీనివాసులురెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement