- ఆ పార్టీ నేతలకు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ కొండేటి సవాల్
టీడీపీ అవినీతిపై చర్చకు సిద్ధం
Published Tue, Oct 4 2016 10:13 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
పి.గన్నవరం :
టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై మండలంలో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. మంగళవారం పి.గన్నవరంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనలో అవినీతి హెచ్చు మీరిపోయిందన్నారు. పి.గన్నవరంలో ఇళ్ల స్ధలాలను రూ.30 వేల వంతున టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని కొండేటి ధ్వజమెత్తారు. ఈ అంశంపై అధికారులు విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ పథకాలను టీడీపీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని అన్నారు. దశాబ్ధాల తరబడి దేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు సైతం వైఎస్సార్ సీపీలో చేరుతుండడంతో భరించలేని ఆ పార్టీ నాయకులు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మండలశాఖ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement