టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు | tdp leaders switch to trs in medak | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు

Published Mon, Feb 1 2016 6:12 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

tdp leaders switch to trs in medak

మనూరు: మెదక్ జిల్లా మనూరు మండలానికి చెందిన సుమారు 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సోమవారం ఇక్కడ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ వారిని పార్టీలోకి ఆహ్వనించారు.

ఈ సందర్భంగా బాదల్‌గామ్ సర్పంచ్ నాగుపటేల్ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు తమను ఆకర్షించాయన్నారు. పార్టీలో చేరిన వారిలో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాల్‌గొండ, చంద్రకళ, నాయకులు నాగ్‌గొండ, బాబుపటేల్, కోట వీరన్న, జగదీశ్వర్, యాదుగొండ, మారుతి గౌడ్, లింగం, పవన్, రాజు గ్రామానికి చెందిన యూత్ నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement