Switch
-
స్విచ్‌బోర్డ్‌లో రూ. 15 కోట్ల గోల్కొండ వజ్రం
కోల్‌కతా: సత్యజిత్ రే దర్శకత్వంలో 1979లో వచ్చిన ‘జోయ్ బాబా ఫెలూనాథ్’ అనే బెంగాలీ సినిమాలో అత్యంత ఖరీదైన వజ్రం దుర్గామాత అధిష్టించిన సింహం బొమ్మ నోటిలో చాలాకాలం తర్వాత దొరుకుతుంది. మిస్టరీ వీడిపోతుంది. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. ఇక్కడ కరెంటు స్విచ్‌బోర్డులో రూ.15 కోట్ల విలువైన 32 క్యారెట్ల బరువైన గోల్కొండ వజ్రం దొరికింది. అసలు విషయమేమి టంటే.. ప్రణబ్ కుమార్ రాయ్ అనే వ్యక్తి వద్ద ఈ వజ్రం ఉండేది. 2002లో దాని నాణ్యత, ధర తెల్సుకునేందుకు ఇంద్రజిత్ తపాదార్ అనే వజ్రాల మధ్యవర్తిని సంప్రదించాడు. 2002 జూన్‌లో ఇంద్రజిత్ మరొకడిని తీసుకొని ప్రణబ్ ఇంటికి వచ్చాడు. వారిద్దరూ కలిసి ప్రణబ్‌ను పిస్తోల్‌తో బెదిరించి వజ్రంతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంద్రజిత్ ఇంట్లో గాలింపు చేపట్టారు. వజ్రం ఆచూకీ దొరకలేదు. మరోవైపు తనకేమీ తెలియదని ఇంద్రజిత్ బుకాయించాడు. వజ్రం కచి్చతంగా అతడి ఇంట్లోనే ఉంటుందున్న నమ్మకంతో పోలీసులు అన్వేషణ కొనసాగించారు. అయినాదొరకలేదు. చిట్టచివరకు చాలా రోజుల తర్వాత అదే ఇంట్లో మెట్ల కింద కరెంటు స్విచ్‌బోర్డు లోపలున్న చిన్న సొరంగంలో వజ్రం లభ్యమైంది. నిందితుడు ఇంద్రజిత్‌కు ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇంకోవైపు వజ్రం యజమాని ప్రణబ్ కుమారేనా కాదా అనే దానిపై న్యాయ వివాదం కొనసాగింది. ఆ వజ్రం అసలు సొంతదారు అతడేనని సిటీ సెషన్స్ కోర్టు గతవారం తీర్పునిచి్చంది. వజ్రం రూపురేఖలు మార్చొద్దని, ఇందుకోసం రూ.2 కోట్ల విలువైన బాండ్ సమర్పించాలని ప్రణబ్‌ను ఆదేశించింది. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్, షాజహాన్ వజ్రాలు సైతం గోల్కొండ ప్రాంతానికి చెందినవే. -
ఏటా 40 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల విభాగం వచ్చే పదేళ్లలో ఏటా సుమారు 40% మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు స్విచ్ మొబిలిటీ సీఈవో మహేశ్ బాబు తెలిపారు. గతేడాది 1,200 ఎలక్ట్రిక్ బస్సులు రిజిస్టర్ కాగా, ఈసారి 2,000 దాటేయొచ్చని చెప్పారు. వచ్చే ఏడాది ఇది 6,000కు చేరవచ్చని సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సు తయారీ వ్యయం సగటున రూ. 1.5 కోట్ల స్థాయిలో ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సానుకూల పాలసీలు ఇందుకు తోడ్పడగలవని ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకోవడంపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని మహేష్ బాబు చెప్పారు. తమ సంస్థ విషయానికొస్తే.. ఇప్పటికే 500 పైచిలుకు బస్సులు సరఫరా చేశామని, వచ్చే 12–18 నెలల్లో సుమారు 2,600 బస్సులు అందించనున్నామన్నారు. తెలంగాణకు దాదాపు 1,000 బస్సులు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తయారు చేస్తున్నది తమ కంపెనీ మాత్రమేనని, హెచ్ఎండీఏకి 6 అందిస్తున్నామని తెలిపారు. -
స్విచ్ మొబిలిటీ ఈవీ12 ఈ–బస్
చెన్నై: అశోక్ లేలాండ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగమైన స్విచ్ మొబిలిటీ ఈవీ12 పేరుతో ఈ–బస్‌ను ఆవిష్కరించింది. నగరంలో, నగరాల మధ్య, సిబ్బంది రవాణా, పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే రకాన్నిబట్టి 100–300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్టు స్విచ్ మొబిలిటీ డైరెక్టర్ మహేశ్ బాబు తెలిపారు. బస్ ఖరీదు రూ.1 కోటి ఉంటుందన్నారు. 600లకుపైగా బస్‌లకు ఆర్డర్లు ఉన్నాయని వివరించారు. వచ్చే మూడేళ్లలో స్విచ్ మొబిలిటీ రూ.2,810 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు సంస్థ చైర్మన్ ధీరజ్ హిందూజా వెల్లడించారు. కొత్త ఉత్పత్తుల రూపకల్పన, సాంకేతిక అభివృద్ధి కేంద్రం స్థాపనకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను సైతం పరిచయం చేస్తామన్నారు. -
ఏబీ స్విచ్‌లు ఏవీ..?
మెదక్‌జోన్: కరెంట్‌తో ఎంత మేలు జరుగుతుందో అశ్రద్ధ చేస్తే అంతకు రెట్టింపు కీడు చేస్తోంది. ప్రాణాలను సైతం బలి తీసుకుంటోంది. ఆరు నెలలుగా జిల్లాలో నూతనంగా బిగిస్తున్న ట్రాన్స్ఫార్మర్లకు ఏబీ స్విచ్ (ఆన్,ఆఫ్)లు అమర్చడం లేదు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని క్షేత్రస్థాయి అధికారులతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ♦ జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. కానీ చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో అధికంగా రైతులు బోరుబావుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ♦ ఇప్పటికే జిల్లాలో 1.98 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా మరొక 30 వేల బోర్లు ఉన్నాయని సమాచారం. ♦ గతంలో 10 నుంచి 16 బోరుబావులకో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను అమర్చేవారు. వాటిపై లోడ్ ఎక్కువ కావడంతో తరుచూ కాలిపోయేవి. ♦ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు 3 నుంచి 4 బోరుబావులకు ఒక 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను అమర్చుతున్నారు. ♦ దీంతో ఒక్క రైతు పొలంలో 3 నుంచి 4 బోర్లు ఉన్నా ఆ రైతుతో 4 డీడీలు కట్టించుకుని సొంతంగా ట్రాన్స్ఫార్మర్ను సదరు రైతు పొలంలోనే అమర్చుతున్నారు. ♦ ఇంతవరకు బాగానే ఉన్నా ఆరు నెలలుగా ఏబీ స్విచ్‌లను బిగించకుండానే రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను బిగిస్తున్నారు. ♦ దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏబీ స్విచ్ ఉంటే సదరు రైతు పొలంలో స్టార్టర్ డబ్బా వద్ద ఏమైనా సమస్య ఉత్పన్నమైన, ఫ్యూజ్ వైర్ పోయినా ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకుని మరమ్మతులు చేసుకుంటాడు. ♦ అయితే ఆసౌకర్యం లేకపోవడంతో సంబంధిత సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి ఎల్సీ (లైన్) నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ఈక్రమంలో ఒక వ్యక్తి ఎల్సీ తీసుకోవాలంటే కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. ♦ సామాన్య రైతులకు ఎల్సీ ఇవ్వడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతుల వద్ద సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే ఆపరేటర్ ఫోన్ నెంబరే ఉండదు. ♦ ఆలోపల ఏదైన ప్రమాదం ఉత్పన్నమైనప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరు నెలలుగా వందల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. వాటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చి వినియోగంలోకి తెచ్చారు. కానీ ఏబీ స్విచ్‌లు మాత్రం అమర్చలేదు. నేటికీ స్టోర్ రూం కరువు.. ♦ జిల్లా ఏర్పాటై నాలుగేళ్లు గడిచినా విద్యుత్ సామగ్రితో పాటు ట్రాన్స్ఫార్మర్ల నిల్వకోసం జిల్లాలో నేటికీ స్టోర్ రూం ఏర్పాటు చేయలేదు. దీంతో అత్యవసరంగా వైర్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఏదైనా పరికరాలు కావాలన్నా సంగారెడ్డికి పరుగులు పెడుతున్నారు. ♦ కొన్ని సందర్భాల్లో సామగ్రి సమయానికి అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పనులు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు విన్నవించాం జిల్లాలో ఏబీ స్విచ్‌ల కొరత ఉన్నమాట వాస్తవమే. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అలాగే జిల్లాకు స్టోర్ రూం లేక విద్యుత్ పరికరాల కోసం సంగారెడ్డి వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో ప్రభుత్వ భూమి ఇచ్చి స్టోర్ రూం నిర్మిస్తామని చెప్పారు. – జానకిరాములు, ఎస్ఈ విద్యుత్‌శాఖ మెదక్ -
2022లో ఉద్యోగం మారిపోవాలి..! కారణాలు ఇవే..
న్యూఢిల్లీ: మెజారిటీ నిపుణులు ఈ ఏడాది ఉద్యోగం మారిపోయే ఆలోచనతో ఉన్నారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ భవిష్యత్తు పట్ల వారిలో ఎంతో ఆశావాదం కనిపించింది. నిపుణుల నెట్వర్క్ సంస్థ లింక్డ్ఇన్ ‘జాబ్ సీకర్ రీసెర్చ్’ పేరుతో సర్వే వివరాలను మంగళవారం విడుదల చేసింది. దేశంలో 82 శాతం నిపుణులు 2022లో ఉద్యోగాన్ని మార్చాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. ఎందుకని? అని ప్రశ్నించగా.. చేస్తున్న పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కష్టంగా ఉందని, తగినంత ధనం లేదని, కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలని ఉందని ఇలా పలు రకాల సమాధానాలు సర్వేలో పాల్గొన్న వారి నుంచి వచ్చాయి. పని పరంగా సౌకర్యమైన ఏర్పాట్లే తమకు ప్రాధాన్య అంశంగా ఎక్కువ మంది చెప్పారు. చేస్తున్న పని – జీవన సమతుల్యత సరిగ్గా లేకపోవడం వల్ల పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులు 1.3 రెట్లు అధికంగా ఉద్యోగాన్ని వీడే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. పురుషుల్లో ఇలాంటి అభిప్రాయం కలిగిన వారు 28 శాతంగా ఉన్నారు. మెరుగైన వేతనం ఇస్తే ప్రస్తుత కంపెనీతోనే కొనసాగుతామని 49 శాతం మంది మహిళలు చెప్పగా.. పునరుషుల్లో ఇది 39 శాతంగానే ఉంది. ప్రాధాన్యతల్లో మార్పు.. ‘‘తమ కెరీర్ (వృత్తి జీవితం) పట్ల పునరాలోచించేలా, కొత్త ఉద్యోగ అవకాశాల అన్వేషణ, జీవిత ప్రాధాన్యతల విషయంలో పునరాలోచించుకునేలా మహమ్మారి చేసింది. నైపుణ్యాలే ఇప్పుడు నడిపించే సాధనం. నేడు సౌకర్యమే వారి మొదటి ప్రాధాన్యం’’ అని లింక్డ్ఇన్ న్యూస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకిత్ వెంగుర్లేకర్ తెలిపారు. ఐటీ, హెల్త్‌కేర్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగినట్టు చెప్పారు. నిపుణులు తమ ఉద్యోగ బాధ్యతలు, కెరీర్ పట్ల నేడు ఎంతో నమ్మకంగా ఉన్నారని, మొత్తం మీద 2022లో ఉద్యోగాల లభ్యత మెరుగ్గా ఉంటుందని లింక్డ్ఇన్ తెలిపింది. ప్రశ్నించుకునే తత్వం ఉద్యోగుల్లో కెరీర్, భవిష్యత్తు పట్ల ఎంతో సానుకూలత కనిపించినప్పటికీ.. 71 శాతం మంది నిపుణులు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో చేస్తున్న పనిలో తమ నైపుణ్యాలను ప్రశ్నించుకుంటున్నట్టు లింక్డ్ఇన్ సర్వే పేర్కొంది. తమ పనిపై సందేహం అన్నది గడిచిన రెండేళ్లుగా ఒంటరిగా పనిచేస్తుండడం వల్లేనని తెలిపింది. కరోనా మహ మ్మారి పని విషయంలో తమ నమ్మకాన్ని దెబ్బతీసినట్టు 33 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. -
ఇంట్లో విద్యుత్ సమస్యలు.. స్విచ్ బోర్డు రిపేర్లు తెలుసుకోండిలా..
సాక్షి, వెబ్ డెస్క్: సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలో విద్యుత్‌కు సంబంధించిన పలు సమస్యలను తలెత్తుతుంటాయి. రాత్రివేళ అకస్మాత్తుగా పవర్ పోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపోయిందని అనుకుంటాము. అయితే, చిన్న చిన్న ఎలక్ట్రికల్ సమస్యలు.. కరెంట్ బల్బ్‌లు మార్చటం, తెగిపోయిన ఫ్యూజ్ స్థానంలో మరోటి అమర్చటం వంటి రిపేర్లను సులభంగానే చేసుకోగలగుతాము. కానీ ఇంట్లోని స్విచ్‌బోర్డులో సమస్య ఉంటే మాత్రం రిపేర్ చేసే సాహసం చేయము. ఎందుకంటే స్విచ్ బోర్డుల్లో పలు రకాల ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి కనుక. పవర్ సర్యూట్లు ఎక్కడ అనుసంధానం కోల్పోయిందో గుర్తించలేము. అయితే ఇటువంటి వాటిని సంబంధిత ఎలక్ట్రీషియన్స్ మాత్రమే బాగుచేయగలరు. స్విచ్ బోర్డులోని సర్క్యూట్స్ ఇంట్లోని వంట గది, బెడ్రూం, హాల్, బాత్ రూంలకు అనుసంధానమై ఉంటాయి. కరెంట్ వస్తూ, పోతూ ఉండటంతో తరచూ స్విచ్ బోర్డులో సమస్యలు ఏర్పాడతాయి. అయితే కొన్ని సార్లు స్విచ్ బోర్డులు షార్ట్ సర్క్యూట్స్ కారణంగా పేలిపోయి ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు చూశాం. అయితే మీ ఇంట్లోని స్విచ్ బోర్డుల పరిస్థితి ఎలా ఉందో? ఎప్పుడు అవి రిపేర్ దశకు చేరుకున్నాయో తెలుసుకుంటే చాలా ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చు. స్విచ్ బోర్డులు రిపేర్‌కు వచ్చాయని తెలుసుకొనే కొన్ని సంకేతాలు మీ కోసం.. 1. స్విచ్ బోర్డుల వద్ద కాలిపోయిన వాసన రావటం.. ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డుల వద్ద కాలిపోయిన వాసన రావటం మనం గమనిస్తాము. కానీ, ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. అయితే కరెంట్ ఓవర్ లోడ్ వల్ల స్విచ్ బోర్డుల్లో ఉండే వైర్ల నుంచి కాలిపోయిన వాసన వస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జాగ్రత్తపడి ఎలక్ట్రిషియన్‌ను సంప్రదించి కొత్త వాటిని మార్చుకోవాలి. 2. కాలం చెల్లిన పాత స్విచ్ బోర్డులు.. ఇల్లు కట్టినప్పటి నుంచి కొంత మంది స్విచ్ బోర్డులను అసలు మార్చకుండా కాలం గడుపుతారు. అయితే సుమారు 20 ఏళ్లు దాటిన స్విచ్ బోర్డులను తప్పనిసరిగా మార్చుకోవాలి. మారుతున్న సాంకేతికతతో కొత్త ఎలక్ట్రికల్ బోర్డులను ఉపయోంగిచడంతో పలు విద్యుత్ సమస్యలను నిలువరించవచ్చు. పాత వాటిని మార్చటంతో నాణ్యమైన కరెంట్ సరాఫరా ఇళ్లలో పొందవచ్చు. 3. బల్బులు మినుకు మినుకు మంటూ ఆగిపోవటం.. వైర్ల మధ్య చోటు చేసుకున్న లూజ్ కనెక్షన్ల కారణంగా తరచూ ఇంట్లోని బల్బులు మినుకు మినుకు మంటూ ఆగిపోతాయి. అంటే ఇళ్లలోకి వచ్చే విద్యుత్‌తో స్విచ్ బోర్డులపై అధికంగా లోడ్ పడుతోందని గమనించాలి. లేదంటే వాటికి ఆ కరెంట్‌ను సరఫరా చేసే సామర్థ్యం తగ్గినట్టు గుర్తించాలి. 4. సర్క్యూట్స్ పాడవటంతో కరెంట్ ట్రిప్ కావటం.. విద్యుత్ అధిక లోడ్, ఆకస్మికంగా కరెంట్ రావటం, పోవటం కారణంగా స్విచ్ బోర్డులోని పవర్ సర్కూట్లు పాడవుతాయి. పాడైన స్విచ్ బోర్డుల్లో ఉండే విద్యుత్ సర్క్యూట్స్ కారణంగా కరెంట్ తరచూ ట్రిప్ అవుతూ ఉంటుంది. పలు చిన్న, చిన్న సర్క్యూట్స్ తో అనుసంధానమయ్యే స్విచ్ బోర్డులు కరెంట్ లోడ్‌ను తట్టుకోవటం లేదని గుర్తించాలి. 5. తరచూ ఫ్యూజ్‌లు మండిపోవటం.. కరెంట్ సరాఫరా మార్పుల్లో భాగంగా తరచూ స్విచ్ బోర్డులో ఉండే ఫ్యూజ్‌లు మండిపోతాయి. స్విచ్ బోర్డులు కరెంట్‌ను కంట్రోల్ చేయకపోతే కూడా తరచూ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అయి ఫ్యూజ్ మండిపోయే అవకాశం ఉంటుంది. అయితే ముందుగానే స్విచ్ బోర్డులను పనితీరు, వాటి స్థితిని గుర్తించగలిగితే ఇళ్లలో విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు. -
టీఆర్ఎస్లోకి పువ్వాడ అజయ్
నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో చేరనున్నట్లు ప్రకటన కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆవేదన ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆ పార్టీని వీడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేశానన్నారు. అంపశయ్యపై ఉన్న పార్టీని బతికించుకునేందుకు చేసిన ప్రతి ప్రయత్నాన్ని పార్టీలోని పలువురు నాయకులు అడ్డుకున్నారని అజయ్ ఆరోపించారు. ఇటీవల ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామకాల్లోనూ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. పార్టీ కోసం కాకుండా రాజకీయాలు చేసేవారికి పార్టీలో పెద్దపీట వేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తలపెట్టిన అభివృద్ధి పనులను అడ్డుకోవాలని, వాటికి వ్యతిరేకంగా విమర్శలు చేయాలని పార్టీ నాయకులు సూచించడం శోచనీయమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై సీఎం చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వ్యతిరేకించి తప్పు చేశామన్నారు. ఇలా ప్రతి అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం, నిధులు రాకుండా హడ్కోకు ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లా, ఖమ్మం నియోజకవర్గం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని గ్రహించే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం తన అనుచరులతో హైదరాబాద్ బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరతానని ప్రకటించారు. జిల్లా అభివృద్ధిని కాంక్షించే కాంగ్రెస్ నాయకులు తన వెంట రావాలని కోరారు. -
ఇంట్లో గాలి కాలుష్యాన్ని కనుక్కోవచ్చు ఇలా..!
రోజూ మనం ఇంట్లో పీల్చుకునే గాలి ఎంత స్వచ్చమైనదో తెలుసుకునేందుకు.. భారతీయ సంతతి వ్యక్తితో కూడిన జపాన్ శాస్త్రజ్ఞుల బృందం కనుగొంది. గ్రాఫైన్ తయారుచేసిన ఈ సెన్సార్ తక్కువ శక్తిని వినియోగించుకుని మన ఇంట్లోని గాలి ఎంత కలుషితమయిందో తెలియజేస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇళ్లు, ఆఫీస్, స్కూళ్లలో గాలి కాలుష్యం వల్ల కలిగే జబ్బులు పెరిగిపోతున్నాయి. దీనిపై జపాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు. ఎలా పనిచేస్తుంది..? ఇంటిలో ఉన్న వస్తువుల నుంచి విడుదలవుతున్న వాయువులు, కార్బన్ డై ఆక్సైడ్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ గ్యాస్ అణువులు, బిల్డింగ్ ఇంటీరియర్స్ నుంచి విడుదలయ్యే అణువులను సెన్సార్‌ను ఉపయోగించి పసిగడుతుంది. ఈ సెన్సార్‌లో వాడిన టెక్నాలజీ వల్ల పీపీఎమ్ల్లో ఉండే అణువులను సైతం ఇది కనిపెడుతుంది. తాము తయారుచేసిన సెన్సార్ ఎంత బాగా పనిచేస్తుందో పరీక్షించడానికి ఒక గదిలో సెన్సార్‌ను ఉంచి కొద్ది మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసిన కొద్ది సెకన్లలోనే సెన్సార్ అలర్ట్ చేయడం ప్రారంభించింది. వీటితో పాటు అతి తక్కువ విద్యుత్తును తీసుకుని పనిచేసే స్విచ్‌లను ఈ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ రెండు ఆవిష్కరణలను కలిపి అల్ట్రా లో పవర్ సెన్సార్ సిస్టంను తయారు చేసేందుకు ఈ బృందం అడుగులు వేస్తోంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. -
టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు
మనూరు: మెదక్ జిల్లా మనూరు మండలానికి చెందిన సుమారు 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సోమవారం ఇక్కడ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ వారిని పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా బాదల్‌గామ్ సర్పంచ్ నాగుపటేల్ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు తమను ఆకర్షించాయన్నారు. పార్టీలో చేరిన వారిలో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాల్‌గొండ, చంద్రకళ, నాయకులు నాగ్గొండ, బాబుపటేల్, కోట వీరన్న, జగదీశ్వర్, యాదుగొండ, మారుతి గౌడ్, లింగం, పవన్, రాజు గ్రామానికి చెందిన యూత్ నాయకులు ఉన్నారు. -
సారీ.. నా స్విచ్ బంద్ కాలేదు!
పూర్వం ఓ రాజు తెలివైన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరిని సలహాదారుగా నియమించుకోవాలని అనుకున్నాడు. ముగ్గురికీ తలపై ఒక్కో టోపీ పెట్టాడు. ఒక టోపీ నీలిరంగులో, మిగతా రెండు తెలుపు రంగులో ఉంటాయని, ఎదుటివారి టోపీలను చూసి ఎవరి తలపై ఉన్న టోపీ రంగును వారు చెప్పాలని అడిగాడు. ఇది ‘ద కింగ్స్ వైజ్మెన్ పజిల్’గా చాలామందికి తెలిసిన పరీక్షే. అయితే, ఈ పరీక్షలో మొట్టమొదటిసారిగా ఓ యంత్రుడు కూడా నెగ్గాడు! మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే ఓ సమస్యను సైతం పరిష్కరించాడు. ఫ్రెంచ్ కంపెనీ ఆల్డిబరాన్కు చెందిన ‘నవో’ హ్యూమనాయిడ్ రోబో ఈ ఘనతను సాధించింది. రోబోలకు కృత్రిమ తెలివి దిశగా కీలక విజయం అయిన ఈ పరీక్షను న్యూయార్క్‌లోని ‘రెన్సెలర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ఏఐ అండ్ రీజనింగ్ ల్యాబ్’లో నిర్వహించారు. వివరాల్లోకెళితే.. రోబోల తలపై తడుతూ ఓ స్విచ్‌ను ఆపేస్తారు. ఓ రోబో తలపై డమ్మీ స్విచ్ ఉంటుంది. దానిని ఆపేసినా తేడా ఉండదు. ఆ స్విచ్ ఏ రోబోకు పెట్టామన్నది మాత్రం వాటికి తెలియదు. స్విచ్‌లు ఆపేశాక.. డమ్మీ స్విచ్ ఉన్న రోబో తనకే ఆ స్విచ్ ఉందన్న విషయాన్ని గుర్తించి చెప్పాలి. ఇదీ పరీక్ష. అయితే, మీలో ఎవరికి డమ్మీ స్విచ్ ఉందని అడగ్గానే.. కొన్ని క్షణాలకు ఓ రోబో లేచి నిలబడింది. ‘నాకు తెలియద’ని బదులిచ్చింది. వెంటనే పొరపాటు గ్రహించి చేయి ఊపుతూ ‘సారీ.. నాకు ఇప్పుడు తెలిసిపోయింది. నేను మాట్లాడగలుగుతున్నాను. నా స్విచ్ బంద్ కాలేదు..’ అని చెప్పింది. పరీక్షలో గెలవడమంటే.. పరీక్ష నియమాలను అర్థం చేసుకోవడం, ఇతర రోబోలకు తనకు ఉన్న తేడాను తెలుసుకోవడం, ఇతర సామర్థ్యాలను రోబో చాటుకున్నట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
స్విచ్‌లో దెయ్యం!
ప్రేమించుకోవడం... ప్రమాణాలు చేసుకోవడం... నువ్వు లేనిదే నేను బతకలేను... నీతోనే నాజీవితం... నేను ముందే చనిపోతే... నిన్ను కూడా నా వెంటే తీసుకువెళతాను... అంతేకాని... ఒంటరిగా బతకను... బతకలేను... ఇటువంటి మాటలు ప్రేమికుల మధ్య సర్వసాధారణం... కాని ఈ మాటలే నిజమైతే ఏమవుతుందో... ‘స్విచ్’ లఘుచిత్రం ద్వారా చూపాడు వై. వెంకట్‌రెడ్డి డెరైక్టర్స్ వాయిస్ మాది ప్రకాశంజిల్లా కందుకూరు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఏ సినిమా విడుదలైనా తప్పకుండా చూసేవాడిని. పెరిగి పెద్దయ్యాక సినిమా మీద ఉన్న అభిమానం కాస్తా సినిమా తీయాలనే ఆకాంక్షగా మారింది. డిగ్రీ పూర్తయ్యాక చాలా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఇంటర్ఫేస్ డిజైనర్‌గా పని చేసి, ప్రస్తుతం ఉద్యోగం మానేశాను. సినిమాల మీదే మనసు లగ్నం చేస్తున్నాను. తెలుగు చలనచిత్రం రంగంలో మంచి దర్శకుడిగా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. మా తల్లిదండ్రులు, స్నేహితులు నాకు ఎంతగానో సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తు న్నారు. హారర్ సినిమా తక్కువ నిడివిలో ఉంటే ప్రేక్షకులను భయపెట్టడం కష్టమైన విషయమని చిత్రసీమకు చెందిన కొందరు మిత్రులు సలహా చెప్పడంతో, వారి మాటలను చాలెంజ్‌గా తీసుకుని ఈ సినిమా తీశాను. ఈ కథ నేపథ్యం గురించి చెప్పాలంటే... మనం సాధారణంగా చూసే స్విచ్ దానంతట అదే ఆన్/ఆఫ్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ చిత్రం తీయడానికి మొదటి అడుగు వేశాను. నా మిత్రుడు వంశీ ఈ సినిమాకి ఆర్థిక సహాయం అందచేశాడు. ఈ సినిమా కోసం మేము పదిరోజులు కష్టపడ్డాం. కొన్ని కొన్ని సార్లు సీన్లు అనుకున్న విధంగా రాకపోతే మళ్లీ మళ్లీ చిత్రీకరించాం. మా కెమెరామెన్ రమేష్ తన పూర్తి సహకారం అందించటం వల్ల సినిమా బాగా తీయగలిగాం. లో బడ్జెట్ సినిమా కావడంతో, ఈ చిత్రానికి ఎడిటింగ్ నేనే చేశాను. ఇంటర్నెట్లో నుంచి మ్యూజిక్ తీసుకుని మిక్స్ చేశాను. సినిమాని యూ ట్యూబ్‌లో పెట్టిన తర్వాత, చిత్రాన్ని చూసినవారంతా ‘మంచి హారర్ ఫిల్మ్ తీశావు’ అని నన్ను మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ‘కిడ్నాప్’ అనే కామెడీ చిత్రం చేస్తున్నాను. షార్ట్‌స్టోరీ కొత్తగా ఇంట్లోకి వచ్చిన వ్యక్తికి... ఆ ఇంట్లో భయానకమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో స్విచ్ దానంతట అదే ఆన్ అయ్యి అతడిని భయపెడుతుంది. లైట్ ఎన్నిసార్లు ఆపినా మళ్లీ వెలుగుతూ ఉంటుంది, మళ్లీ దానంతట అదే ఆరిపోతూ ఉంటుంది. క్రమేణా ఒక ఆడగొంతు ఏడుస్తూ వినిస్తుంది. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తోందో, ఎవరిదో అర్థం కాదు. భయపడుతూనే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూంటాడు. ఆ క్రమంలో, జరిగిన సంగతులకు కారణం దెయ్యం అని తెలుస్తుంది. ఆ దెయ్యం ఎవరు, ఎందుకు ఇలా ఇతడిని వెంటా డింది, అతడిని ఏమి చేసింది అనేదే క్లుప్తంగా ఈ చిత్ర కథ. కామెంట్ హారర్ సినిమాలను ఇంటరెస్టింగ్‌గా చూపడం చాలా కష్టం. కెమెరా యాంగిల్స్, వింత వింత ధ్వనులతోనే హారర్ సినిమాను భయంకరంగా, ఉత్సుకత చూపేలా తీయగలరు. ఆవిషయంలో ఈ దర్శకుడు నూటికి నూరు శాతం సక్సెస్ అయినట్లే. కెమెరాను బాగా ఉపయోగించుకున్నాడు. భయపడటం, భయపెట్టడం విషయంలో ఈ యువకుడు పూర్తి విజయం సాధించినట్లే. భయాన్ని అందరూ భయపడేలా చాలా భయంకరంగా చూపాడు. శబ్దాలతో ఉలిక్కిపడేలా చేశాడు. దెయ్యంగా వేసిన అమ్మాయి, హీరోయిన్గా కంటె దెయ్యంగా చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ చూపింది. తెర మీదకు ఆ అమ్మాయి రాగానే ఒక్కసారిగా జడుసుకుంటాం. ఈ చిత్రం చూసిన తర్వాత ఎవరికైనా సరే స్విచ్ చూస్తే భయం వేయకమానదు. అయితే ఇందులో చిన్నచిన్న లోపాలు లేకపోలేదు. ఎడిటింగ్ ఇంకా బాగా చేయాలి. నటన విషయంలో మరింత పరిణతి ఉండాలి. అలాగే డైలాగ్ డెలివరీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఇటువంటివి సరిచేసుకుంటే ఈ దర్శకుడు మరింత మంచి పేరు సంపాదించుకోగలుగుతాడు. - డా.వైజయంతి