పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలి
– ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం
– ఆర్‌యూలో ఏఐఎస్‌ఎఫ్ మౌన దీక్ష
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించి బుద్ధిచెప్పాలని ఏబీవీపీ జిల్లా కోకన్వీనర్ మహేంద్ర కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సోమవారం ఉగ్రవాదుల దాడిలో అమరులైన 17 మంది జవాన్లకు ఏబీవీపీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. అనంతరం రాజ్‌విహార్‌లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. పాకిస్తాన్‌కు భారత సైన్యాన్ని ఎదురుకునే శక్తి లేక దొంగచాటు దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. పాక్ చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని, ఆ దేశానికి సహాయ సహకారాలను నిలిపి వేయాలని కోరారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి గణేష్, సెంట్రల్ జోన్ ఇన్‌చార్జి భరత్, నగర సహాయ కార్యదర్శి హర్మన్‌రెడ్డి, నాయకులు రఫీ, మధు, రామదాసు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఆర్‌యూలో ఏఐఎస్‌ఎఫ్ మౌన దీక్ష
ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ రాయలసీమ యూనివర్సిటీలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. అమరులైన జవాన్లకు ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్ర మాట్లాడుతూ..ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్ర దాడిలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఉసేన్‌బాషా, రామకష్ణ, కష్ణమూర్తి, శంకరాచారి, ఉస్మాన్ పాల్గొన్నారు.