అయ్యవార్లకు పరీక్షా సమయం | teachers exam time | Sakshi
Sakshi News home page

అయ్యవార్లకు పరీక్షా సమయం

Published Sat, Aug 13 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

అయ్యవార్లకు పరీక్షా సమయం

అయ్యవార్లకు పరీక్షా సమయం

  • స్కూల్‌ అసిస్టెంట్లకు ఆన్‌లైన్‌లో టీఎన్‌ఐటీ పరీక్ష
  • 20, 21 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశం
  • ఆగ్రహిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
  •  
    బోధిస్తున్న సబ్జెక్టుల్లో ఉపాధ్యా యుల శక్తి సామర్థ్యాలు, ప్రతిభ, లోటుపాట్లను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్లకు ట్రైనింగ్‌ నీడ్‌ ఐడెంటిఫికేషన్‌ టెస్ట్‌ (టీఎన్‌ఐటీ) పేరుతో ఈ నెల 20, 21 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ పరీక్ష టైంటేబుల్‌ విడుదల చేసి, మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని పరీక్షలూ పాసై వచ్చిన తమకు మళ్లీ ఇప్పుడు పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడంపై అయ్యవార్లు ఆగ్రహిస్తున్నారు.
     
    రాయవరం :
    జిల్లాలోని మండల ప్రాథమికోన్నత, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ ఉపాధ్యాయులందరూ టీఎ¯Œæఐటీ ఆన్‌లైన్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జిల్లాలో వారి సంఖ్య సుమారుగా 14 వేల వరకూ ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు.
    150 మార్కులకు పరీక్ష
    ఆయా సబ్జెక్టులకు సంబంధించి రెండున్నర గంటల పాటు ఆన్‌లైన్‌లో 150 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. తెలుగు, హిందీ, సంస్కృతం వంటి సబ్జెక్టులకు ఆయా భాషల్లోనే పేపరు ఉంటుంది. గణితం, సైన్స్, సోషల్‌ సబ్జెక్టులు బోధించేవారికి ఇంగ్లిషు, తెలుగు భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఉన్నత పాఠశాలల్లో పీఈటీలకు కూడా పరీక్ష ఉంటుంది. జనరల్‌ ఏరియాలో 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌కు 10, కంప్యూటర్‌ స్కిల్స్‌కు 20, క్లాస్‌రూమ్‌ మేనేజ్‌మెంట్‌కు 20 చొప్పున మార్కులు ఉంటాయి. ఆయా సబ్జెక్టుల్లో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. స్కూల్‌ సబ్జెక్టులో 50 మార్కులకు, కంటెంట్‌ లెవెల్‌ అప్‌ టు ఇంటర్మీడియెట్‌ 20 మార్కులు, మెథడాలజీ, పెడగాజీకి 30 మార్కులు కేటాయించారు.
    ఉత్తీర్ణత మార్కులు ఎంతో..!
    ఈ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు ఎంతనేది ప్రభుత్వం పేర్కొనలేదు. ఒకవేళ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు సాధించని టీచర్ల పట్ల ఎలా వ్యవహరిస్తారో స్పష్టం చేయలేదు. ఇంటర్మీడియెట్‌ సిలబస్‌పై ఇచ్చే ప్రశ్నలు ఇప్పటి పాఠ్యాంశాలకు సంబంధించి ఉంటాయేమోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాల క్రితం అప్పటి సిలబస్‌ ఆధారంగా ఉత్తీర్ణులైన తమకు కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఇప్పటి ఇంటర్మీడియెట్‌ పాఠ్యాంశాలపై సిలబస్‌ నిర్ణయించి పరీక్షకు హాజరు కావాలని ఆదేశించడం ఎంతవరకూ సమంజసమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు కేవలం 10 శాతం మంది ఉంటారని పలువురు అంటున్నారు.
    మున్సిపల్‌ టీచర్లపై వివక్ష
    ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌ టీచర్ల మాదిరిగానే మున్సిపల్‌ టీచర్లు 010 ద్వారా జీతాలు పొందుతున్నారు. వీరితోపాటు ప్రైవేటు పాఠశాలల టీచర్లు కూడా పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయులు ఫీజు చెల్లించనవసరం లేదని పేర్కొన్న ప్రభుత్వం.. తమ విషయంలో మాత్రం వివక్ష చూపించడంపై 
    మున్సిపల్‌ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
    సమంజసం కాదు
    విద్యాశాఖ వ్యవహారం తలకు రోకలి చుట్టుకుంటున్నట్లుగా ఉంది. అన్ని పరీక్షలూ పాసై వచ్చిన ఉపాధ్యాయులకు ఇప్పుడు తిరిగి శిక్షణ కోసం పరీక్ష పెడతాననడం విడ్డూరంగా ఉంది.
    – టీవీ కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌
    ఉపసంహరించుకోవాలి
    స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించడం సమంజసం కాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉ పసంహరించుకోవాలి.
    – చింతాడ ప్రదీప్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ 
    సహేతుకం కాదు
    ప్రభుత్వం ఎలా ఆలోచిస్తోందో అర్థం కావడం లేదు. దశాబ్దాల సర్వీసు అందించిన వారికి ఇప్పుడు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడం సహేతుకం కాదు. దీనిపై పునరాలోచించాలి.                     
     – వెలగల భామిరెడ్డి, ఎస్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి
    వివక్ష తగదు
    మున్సిపల్‌ టీచర్లు 010 ద్వారా జీతాలు పొందుతున్నప్పుడు వారిపై ప్రభుత్వం వివక్ష చూపించడం తగదు. టీఎన్‌ఐటీకి మున్సిపల్‌ టీచర్లు ఫీజు చెల్లించాలనడం దారుణం.
    – తోటకూర సాయిరామకృష్ణ, రాష్ట్ర కన్వీనర్,మున్సిపల్‌ టీచర్స్‌ అసోసియేషన్, సామర్లకోట
     

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement