unions fire
-
బంగారు బాతును చంపేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2020 ప్రసంగంలో ఎల్ఐసీ ఐపీవో నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధపడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ పబ్లిక్ ఇష్యూ, ప్రత్యక్ష పెట్టుబడులు అంశాలపై ఉద్యోగులు ఆందో ళన చేపట్టనున్నారు. ఎల్ఐసి మూడు ప్రధాన కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలోపాల్గొననున్నాయి.ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయాల వద్ద సోమవారం భోజన విరామ సమయంలో ప్లకార్డ్సు, నినాదాలతో నిరసన తెలపనున్నారు. అలాగే మంగళవారం ఒక గంట నిరసన సమ్మె (వాక్-అవుట్) ను చేపట్టనున్నారు. దీంతోపాటు (ఫిబ్రవరి 3,4 తేదీల్లో నిరసనల అనంతరం) ఉమ్మడి ఫోరం ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మెను కూడా చేపట్టాలని యోచిస్తున్నారు. ఎల్ఐసీ ఐపీవోకు (ఐపిఓ ద్వారా ప్రభుత్వం ఈక్విటీ షేర్లను విక్రయించే ఆఫర్) తాము పూర్తిగా వ్యతిరేకమనీ, మంచి లాభాలతో ఉన్న సంస్థలో వాటాలను ఎందుకు విక్రయిస్తోందని సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఏడాది రూ. 2,600 కోట్ల డివిడెండ్ ఎల్ఐసీ అందజేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఎల్ఐసి క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ రాజ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వం నిధులను కోరినప్పుడల్లా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక రంగం, గృహనిర్మాణానికి నిధులు అందిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. లాభదాయకమైన ఎల్ఐసీ సంస్థను లిస్టింగ్ చేయడమంటే.. బంగారు బాతును చంపేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసీ మూడుప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం- ఎల్ఐసి క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ల సమాఖ్య, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంస్థ మొత్తం శ్రామిక శక్తిలో 90 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 2019 మార్చి చివరి నాటికి ఎల్ఐసిలో 2.85 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్‌లోని తన వాటాను ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకు విక్రయిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2020 ప్రసంగంలో వెల్లడించారు. ఐడీబీఐ బ్యాంకులో వాటాను పూర్తిగా విక్రయించడం ద్వారా మొత్తం రూ. 90,000 కోట్లు సమకూరుతాయని కేంద్రం ఆశిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా రూ. 2.10 లక్షల కోట్లను డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సేకరించాలని.. కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్రానికి 100 శాతం వాటా ఉండగా.. ఐడీబీఐలో 46.5 శాతం వాటా కేంద్రం వద్దే ఉంది. చదవండి : ఐడీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం -
ఎయిరిండియా ప్రైవేటీకరణ తప్పదు
ముంబై: దాదాపు రూ. 80,000 కోట్ల పైగా రుణభారం పేరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరించడం తప్ప మరో మార్గం లేదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియకు ఉద్యోగులంతా సహకరించాలని పేర్కొన్నారు. ఎయిరిండియాకు చెందిన కొన్ని యూనియన్ల నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు స్పష్టం చేశారు. అయితే, ప్రైవేటీకరణ ప్రణాళికలపై యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం కొంత మద్దతునిస్తే కంపెనీని నిర్వహించుకోగలిగే సామర్థ్యం ఉద్యోగులకు ఉందని పేర్కొన్నాయి. ప్రైవేటీకరించినా.. ఉద్యోగ భద్రత వంటి విషయాల్లో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి చెప్పినట్లు దాదాపు గంటపైగా సాగిన సమావేశం అనంతరం యూనియన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘ఎయిరిండియా రుణభారం రూ. 80,000 కోట్ల పైగా ఉందని, ఏ నిపుణుడి దగ్గరా దీనికి పరిష్కార మార్గాలు లేవని మంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో కంపెనీని ప్రైవేటీకరించడం ఒక్కటే ప్రభుత్వం ముందున్న మార్గమని తెలిపారు‘ అని ప్రతినిధి వివరించారు. మరోవైపు, ప్రైవేటీకరణపై యూనియన్ల ప్రతినిధులతో సుదీర్ఘంగా, ఉపయోగకరమైన విధంగా చర్చలు జరిగాయని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో మంత్రి పోస్ట్ చేశారు. మరో 10 రోజుల్లో మళ్లీ సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. -
అయ్యవార్లకు పరీక్షా సమయం
స్కూల్ అసిస్టెంట్లకు ఆన్లైన్లో టీఎన్‌ఐటీ పరీక్ష 20, 21 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశం ఆగ్రహిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు బోధిస్తున్న సబ్జెక్టుల్లో ఉపాధ్యా యుల శక్తి సామర్థ్యాలు, ప్రతిభ, లోటుపాట్లను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్లకు ట్రైనింగ్ నీడ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ (టీఎన్‌ఐటీ) పేరుతో ఈ నెల 20, 21 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ పరీక్ష టైంటేబుల్ విడుదల చేసి, మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని పరీక్షలూ పాసై వచ్చిన తమకు మళ్లీ ఇప్పుడు పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడంపై అయ్యవార్లు ఆగ్రహిస్తున్నారు. రాయవరం : జిల్లాలోని మండల ప్రాథమికోన్నత, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఉపాధ్యాయులందరూ టీఎ¯Œæఐటీ ఆన్లైన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జిల్లాలో వారి సంఖ్య సుమారుగా 14 వేల వరకూ ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. 150 మార్కులకు పరీక్ష ఆయా సబ్జెక్టులకు సంబంధించి రెండున్నర గంటల పాటు ఆన్లైన్లో 150 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. తెలుగు, హిందీ, సంస్కృతం వంటి సబ్జెక్టులకు ఆయా భాషల్లోనే పేపరు ఉంటుంది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు బోధించేవారికి ఇంగ్లిషు, తెలుగు భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఉన్నత పాఠశాలల్లో పీఈటీలకు కూడా పరీక్ష ఉంటుంది. జనరల్ ఏరియాలో 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు 10, కంప్యూటర్ స్కిల్స్‌కు 20, క్లాస్రూమ్ మేనేజ్మెంట్కు 20 చొప్పున మార్కులు ఉంటాయి. ఆయా సబ్జెక్టుల్లో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. స్కూల్ సబ్జెక్టులో 50 మార్కులకు, కంటెంట్ లెవెల్ అప్ టు ఇంటర్మీడియెట్ 20 మార్కులు, మెథడాలజీ, పెడగాజీకి 30 మార్కులు కేటాయించారు. ఉత్తీర్ణత మార్కులు ఎంతో..! ఈ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు ఎంతనేది ప్రభుత్వం పేర్కొనలేదు. ఒకవేళ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు సాధించని టీచర్ల పట్ల ఎలా వ్యవహరిస్తారో స్పష్టం చేయలేదు. ఇంటర్మీడియెట్ సిలబస్‌పై ఇచ్చే ప్రశ్నలు ఇప్పటి పాఠ్యాంశాలకు సంబంధించి ఉంటాయేమోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాల క్రితం అప్పటి సిలబస్ ఆధారంగా ఉత్తీర్ణులైన తమకు కంప్యూటర్ పరిజ్ఞానం, ఇప్పటి ఇంటర్మీడియెట్ పాఠ్యాంశాలపై సిలబస్ నిర్ణయించి పరీక్షకు హాజరు కావాలని ఆదేశించడం ఎంతవరకూ సమంజసమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు కేవలం 10 శాతం మంది ఉంటారని పలువురు అంటున్నారు. మున్సిపల్ టీచర్లపై వివక్ష ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ టీచర్ల మాదిరిగానే మున్సిపల్ టీచర్లు 010 ద్వారా జీతాలు పొందుతున్నారు. వీరితోపాటు ప్రైవేటు పాఠశాలల టీచర్లు కూడా పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయులు ఫీజు చెల్లించనవసరం లేదని పేర్కొన్న ప్రభుత్వం.. తమ విషయంలో మాత్రం వివక్ష చూపించడంపై మున్సిపల్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమంజసం కాదు విద్యాశాఖ వ్యవహారం తలకు రోకలి చుట్టుకుంటున్నట్లుగా ఉంది. అన్ని పరీక్షలూ పాసై వచ్చిన ఉపాధ్యాయులకు ఇప్పుడు తిరిగి శిక్షణ కోసం పరీక్ష పెడతాననడం విడ్డూరంగా ఉంది. – టీవీ కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ ఉపసంహరించుకోవాలి స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వం ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం సమంజసం కాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉ పసంహరించుకోవాలి. – చింతాడ ప్రదీప్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ సహేతుకం కాదు ప్రభుత్వం ఎలా ఆలోచిస్తోందో అర్థం కావడం లేదు. దశాబ్దాల సర్వీసు అందించిన వారికి ఇప్పుడు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం సహేతుకం కాదు. దీనిపై పునరాలోచించాలి. – వెలగల భామిరెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి వివక్ష తగదు మున్సిపల్ టీచర్లు 010 ద్వారా జీతాలు పొందుతున్నప్పుడు వారిపై ప్రభుత్వం వివక్ష చూపించడం తగదు. టీఎన్ఐటీకి మున్సిపల్ టీచర్లు ఫీజు చెల్లించాలనడం దారుణం. – తోటకూర సాయిరామకృష్ణ, రాష్ట్ర కన్వీనర్,మున్సిపల్ టీచర్స్ అసోసియేషన్, సామర్లకోట