సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్
♦ పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయితోనే వివాహం చేయాలని పట్టు
♦ సముదాయించి కిందికి దించిన పోలీసులు
మేడ్చల్ : పెళ్లి చూపుల్లో చూసిన అవ్మూయితోనే తనకు వివాహం జరిపించాలని ఓ యువకుడు సెల్ టవర్‌ఎ క్కి హల్‌చల్ చేశాడు. ఈ ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ వుండలం గవలపల్లికి చెందిన నర్సింలు(25) నగరంలోని చింతల్‌లో నివాసవుుంటూ బాలానగర్ అడ్డాపై డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లీడుకొచ్చిన అతడికి వివాహం చేయాలని భావించిన కుటుంబీకులు 8 నెలల క్రితం నగరంలోని భరత్‌నగర్‌లో ఓ అవ్మూరుుని చూడగా నర్సింలు ఆమెను ఇష్టపడ్డాడు. అయితే, అమ్మాయిని నర్సింలుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబీకులు నిరాకరించారు.
ఆమెనే పెళ్లి చేసుకుంటానని నర్సింలు పట్టుబట్టాడు. ఈక్రమంలో కుటుంబీకులపై ఒత్తిడి తెచ్చాడు. వారు సముదాయించినా ఫలి తం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయుం మేడ్చల్ కు చేరుకున్న నర్సింలు మేడ్చల్ చెక్‌పోస్టు-పారిశ్రామిక వాడల వుధ్య ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కి పైభాగంలో కూర్చున్నాడు. తను పెళ్లిచూపుల్లో నచ్చిన అమ్మాయితోనే వివాహం చేయాలని భీష్మించాడు. అటుగా వెళ్తున్న కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గంటపాటు నర్సింలును సముదాయించారు. అతడితో మైకులో వూట్లాడి కిందికి దించారు. అనంతరం నర్సింలును ఠాణాకు తరలించి కౌన్సెలింగ్ చేశారు. టవరెక్కిన యువకుడిని క్షేమంగా పోలీసులు కిందికి దించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.