ఎన్టీపీసీ తెలంగాణ స్టేజీ-1కు పర్యావరణ అనుమతులు
8, 9 యూనిట్లకు లైన్‌క్లియర్
ఫిబ్రవరి 13న శంకుస్థాపన
హాజరుకానున్న ప్రధాని మోదీ
జ్యోతినగర్: తెలంగాణ స్టేజ్-1లో భాగంగా కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రెండు నూతన యూనిట్ల నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులను మం జూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం న్యూఢిల్లీలో ఎన్టీపీసీ ఈఎంజీ అధికారులు అందుకున్నారు. ఈ 8, 9 యూనిట్లకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 13న రామగుండం రానున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఎన్టీపీసీలోని పీటీఎస్‌లో హెలిప్యాడ్‌ను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ మేరకు తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చేందుకు 4,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు ఎన్టీపీసీ సంస్థఅంగీకారం తెలిపింది.