Environment Ministry
-
జలపాతానికే రంగులు వేసే స్టంట్...పర్యావరణ అధికారులు ఫైర్
ఇటీవల కాలంటో స్టంట్ల క్రేజ్ మామాలుగా లేదు. కొంతమంది సోషల్ మీడియా స్టార్డమ్ కోసం ఎలాంటి స్టంట్లు చేస్తున్నామన్నా అవగాహన కూడా లేకుండా చేసేస్తున్నారు. ఆ స్టంట్లు ఒక్కొసారి వారి ప్రాణాలకు లేదా పక్కవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఉంటున్నాయి. ఇక్కడొక జంట అయితే ప్రకృతినే పొల్యూట్ చేసే స్టంట్‌కి ఒడిగట్టారు. దీంతో రంగంలోకి దిగిన పర్యావరణ అధికారులు ఆ జంట ఎవరా? అని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. వివరాల్లోకెళ్తే... బ్రెజిల్‌కి చెందిన ఒక జంట సహజ సిద్ధమైన జలపాతాలను తమ స్టంట్ కోసం కలుషితం చేశారు. ఇంతకీ ఏం చేశారంటే...జలపాతం సహజంగా పాలనురగాలా కనిపిస్తుంది జౌనా!. ఐతే ఈ జంట నీలి రంగులా కనిపించేలా ఇంకో అమ్మాయి నీలి రంగు ఫోమ్‌ని జల్లుతూ ఉంటుంది. ఈ స్టంట్ ఉద్దేశ్యం ఏంటంటే..నీలిరంగులో జలపాతం కనిపిస్తే శిశువు మగబిడ్డను సూచిస్తుందని చెబుతూ ఈ స్టంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో సహజ సిద్ధంగా కనిపించే జలపాతాన్ని కలుషితం చేస్తారా అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో బ్రైజిల్ పర్యావరణ అధికారులు ఈ సంఘటనపై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అంతేగాదు బ్రెజిల్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన గత ఆదివారం సెప్టంబర్ 25న మాటో గ్రాస్ అనే రాష్ట్రంలో చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఆ జంట కలుషితం చేసిన జలపాతం ప్రసిద్ధ టూరిజం ప్రాంతమైన క్యూమా పే నది అని అధికారులు వెల్లడించారు. ఆ నది పశ్చిమ ప్రాంతంలోని తంగారా డా సెర్రా నగరానికి ప్రాథమిక నీటి వనరు అని కూడా స్పష్టం చేశారు. అసలు ఆ గుర్తు తెలియని దంపతులు ఏ ఉత్పత్తులు వినియోగించి జలపాతానికి నీలి రంగు వచ్చేలా చేశారు, పర్యావరణానికి హాని జరిగిందా లేదా అనే దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. É sério que acharam uma boa ideia colocar corante numa cachoeira?! Tantas maneiras de fazer um chá revelação e conseguiram escolher justo uma com impacto ambiental. pic.twitter.com/YePJ0lPhhQ — A Eng. Florestal do YouTube 🌳 (@vanecosta10) September 26, 2022 (చదవండి: ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ని తలపించేలా నడి రోడ్డులో మహిళల ఫైట్) -
Sakshi Cartoon: మేం ఒప్పుకోం! దీనిని తిప్పి పెట్టండీ!!
మేం ఒప్పుకోం! దీనిని తిప్పి పెట్టండీ!! -
ఏపీలో అల్ట్రాటెక్ సిమెంట్ భారీ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ అల్ట్రాటెక్... ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి సంస్థకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కర్నూలు జిల్లా పెట్నికోట వద్ద రానున్న ఈ ప్రాజెక్టుకై అల్ట్రాటెక్ సుమారు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే కంపెనీ 431.92 హెక్టార్ల స్థలాన్ని ప్లాంటు కోసం కొనుగోలు చేసింది. ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా 40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్ యూనిట్, 60 లక్షల టన్నుల సామర్థ్యంతో సిమెంటు తయారీ కేంద్రాలు ఏర్పాటవుతాయి. అలాగే ప్లాంటు అవసరాల కోసం 60 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుతోపాటు తయారీ ప్రక్రియలో జనించే వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 15 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కూడా రానుంది. 900 మందికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి లభించనుందని సమాచారం. ప్రాజెక్టు ఏర్పాటు, నిర్వహణకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అల్ట్రాటెక్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విభిన్న రంగాల్లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీయే అల్ట్రాటెక్ సిమెంట్. సామర్థ్యం పరంగా భారత్‌లో అతిపెద్ద సిమెంటు ఉత్పత్తిదారుగా నిలిచింది. అయిదు దేశాల్లో విస్తరించిన ఈ సంస్థకు ఏటా 6.8 కోట్ల టన్నుల సిమెంటు తయారీ సామర్థ్యం ఉంది. -
ఎన్టీపీసీ తెలంగాణ స్టేజీ-1కు పర్యావరణ అనుమతులు
8, 9 యూనిట్లకు లైన్‌క్లియర్ ఫిబ్రవరి 13న శంకుస్థాపన హాజరుకానున్న ప్రధాని మోదీ జ్యోతినగర్: తెలంగాణ స్టేజ్-1లో భాగంగా కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రెండు నూతన యూనిట్ల నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులను మం జూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం న్యూఢిల్లీలో ఎన్టీపీసీ ఈఎంజీ అధికారులు అందుకున్నారు. ఈ 8, 9 యూనిట్లకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 13న రామగుండం రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఎన్టీపీసీలోని పీటీఎస్‌లో హెలిప్యాడ్‌ను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ మేరకు తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చేందుకు 4,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు ఎన్టీపీసీ సంస్థఅంగీకారం తెలిపింది. -
ఇక చెత్త ఏరుకునే వారికి అవార్డులు
ముంబయి: చిత్తుకాగితాలు ఏరుకునేవారంటే అందరికీ ఓ రకమైన ఏవగింపే. కానీ, ఇకనుంచి వారికి కూడా సమాజంలో మంచి గుర్తింపు లభించనుంది. పురస్కారాలు లభించనున్నాయి. చిత్తుకాగితాలు ఏరుకునే వారికి కూడా అవార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి వీరికి అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుందని పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. 'చిత్తుకాగితాలు ఏరడం అనేది చెప్పుకునేంత గొప్పగా ఉండకపోవచ్చు. కానీ చాలా కాలంగా అది అత్యంత ముఖ్యమైన రంగం. వారు రోజంతా ఎంతో కష్టపడతారు. ఎన్నో నగరాలు విడుస్తున్న చెత్తచెదారాన్ని వేరు చేస్తూ పర్యావరణానికి మంచి చేస్తుంటారు. ఏళ్లుగా వారు సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు. అందుకే మేం వారికి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది నుంచి యేటా అవార్డులు ఇస్తాం' అని జవదేకర్ చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో తమ శాఖ సాధించిన విజయాలపై మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. -
30 శాతంపైగా పెరిగిన పులుల సంఖ్య
గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుతూ వస్తున్న పులుల సంఖ్య ఎట్టకేలకు పెరిగింది. ఏడేళ్ల కింద 1400 ఉన్న పులుల సంఖ్య ప్రస్తుతం 2226 గా నమోదయినట్లు పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2010 నుంచి పులుల సంఖ్య 30 శాతంపైగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పులులలో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయని మంగళవారం పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. 406 పులులతో కర్ణాటక అన్ని రాష్ట్రాలకన్నా ముందజలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఉత్తరాఖండ్‌లో 340, తమిళనాడులో 229, మధ్యప్రదేశ్‌లో 208, మహారాష్ట్రలో 190, పశ్చిమ బెంగాల్లో 76 పులులు ఉన్నాయి. వేటగాళ్లు, అక్రమంగా రవాణా చేసే అంతర్జాతీయ ముఠాలు, పులుల నివాస ప్రాంతాల కనుమరుగు లాంటి కారణాల వల్ల గత కొన్నేళ్లుగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. 20శతాబ్దం ప్రారంభంలో దాదాపు లక్ష పులులు ఉండగా 2008 సంవత్సరంలో ఈ సంఖ్య 1411కి పడిపోయింది. 2004లో పులుల సందర్శనకి పేరొందిన సరిస్కా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక్క పులి కూడా లేదని తెలుసుకున్న పర్యావరణ వేత్తలు ఆందోళనకి గురయ్యారు. ఈ సంక్షోభం నుంచి బయట పడడానికి పులుల పరిరక్షణ కోసం అప్పటి నుంచి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. -
కెయిర్న్ ఇండియాకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అదనపు చమురు వెలికితీసేందుకు కెయిర్న్ ఇండియాకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. రాజస్థాన్ బ్లాక్ లో అదనంగా 50 శాతం చమురు వెలికితీసేందుకు అనుమతినిచ్చింది. కెయిర్న్ ఇండియా రోజుకు 3 లక్షల బారెల్స్ ముడి చమురు బయటకు తీయనుంది. గ్యాస్ వెలికి తీసేందుకు కూడా కెయిర్న్ ఇండియాకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. దీంతో రాజస్థాన్ బ్లాక్ లో రోజుకు 165 మిలియన్ క్యూబిక్ ఘనపుటడుగుల గ్యాస్ ఉత్పత్తి చేయనుంది. వివిధ రకాల ప్రాజెక్టులకు వేగంగా అనుమతలు మంజూరు చేయడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేయాలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే కెయిర్న్ ఇండియాకు పచ్చ జెండా ఊపింది.