central intelligence bureau
-
ఎన్టీపీసీ తెలంగాణ స్టేజీ-1కు పర్యావరణ అనుమతులు
8, 9 యూనిట్లకు లైన్‌క్లియర్ ఫిబ్రవరి 13న శంకుస్థాపన హాజరుకానున్న ప్రధాని మోదీ జ్యోతినగర్: తెలంగాణ స్టేజ్-1లో భాగంగా కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రెండు నూతన యూనిట్ల నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులను మం జూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం న్యూఢిల్లీలో ఎన్టీపీసీ ఈఎంజీ అధికారులు అందుకున్నారు. ఈ 8, 9 యూనిట్లకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 13న రామగుండం రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఎన్టీపీసీలోని పీటీఎస్‌లో హెలిప్యాడ్‌ను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ మేరకు తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చేందుకు 4,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు ఎన్టీపీసీ సంస్థఅంగీకారం తెలిపింది. -
జాతీయ భద్రతా సలహాదారుగా:దోవల్
-
జాతీయ భద్రతా సలహాదారుగా: అజిత్ దోవల్
న్యూఢిల్లీ: కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధిపతి అజిత్ దోవల్ (69) నూతన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా నియమితులయ్యారు. జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై అపారమైన అనుభవం ఉన్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఆ అంశాలపై సలహాదారుగా వ్యవహరిస్తారు. దోవల్ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం ఆయన నియామకం శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది. ప్రస్తుత ప్రధాని పదవీకాలం ముగిసే వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ దోవల్ ఈ పదవిలో కొనసాగుతారు. శివశంకర్ మీనన్ స్థానంలో దోవల్ బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్-చైనా సరిహద్దు అంశంలో ప్రధాని ప్రతినిధిగానూ ఉంటారు. ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన రెండో కీలక నియామకం ఇది. ఇంతకుముందు ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నృపేంద్ర మిశ్రా నియమితులవడం తెలిసిందే. దోవల్ 1968 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యుత్తమ వ్యూహరచన చేయడంలోనూ, అమలులోనూ నిష్ణాతునిగా ఆయన పేరుపొందారు. -
కేంద్ర ఇంటెలిజెన్స బ్యూరోకు వెళ్లిన అశోక్ ప్రసాద్
తర్వాత ఐబీ చీఫ్ ఆయనే అంటున్న ఐపీఎస్ వర్గాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అశోక్ ప్రసాద్ కేంద్ర ఇంటెలిజెన్స బ్యూరోలో రిపోర్టు చేశారు. నిన్నటి వరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను నిర్వహించిన అశోక్ ప్రసాద్, తన స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజేంద్రకుమార్ ఆ రాష్ట్ర డీజీపీగా నియమితులు కావడంతో ఆయన ఏపీకి తిరిగి వస్తారా? అనే చర్చ సాగింది. అయితే 1979 బ్యాచ్‌కు చెందిన ఈయన రాష్ట్రంలో కొంత కాలం ఎస్పీ, డీఐజీ స్థాయిలలో పనిచేశాక నేరుగా కేంద్ర ఇంటెలిజెన్స బ్యూరోకి వెళ్లి పోయారు. అప్పటి నుంచి ఆయన ఐబీలోనే కొనసాగుతూ, తర్వాత డెప్యుటేషన్‌పై జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితుల్లో డీజీపీగా నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఎవరు డీజీపీ అవుతారనే విషయమై చర్చ సాగుతుండగా జేకేలో రిలీవ్ అయిన అశోక్‌ప్రసాద్ తిరిగి రాష్ట్రానికి రావచ్చనే ఊహాగానాలు సాగాయి. కాగా ఆయన ఐబీలోనే కొనసాగడానికి ఆసక్తిని చూపించారు. అంతేగాక ప్రస్తుత ఐబీ డెరైక్టర్ జనరల్ ఇబ్రహీం పదవీ కాలం ముగిశాక అశోక్ ప్రసాద్‌ను ఈ విభాగం చీఫ్‌గా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.