బోర్పట్ల చెరువుకట్టపై ఈత మొక్కలు నాటుతున్న జెడ్పీ చైర్‌పర్సన్
- జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి
- బోర్పట్ల గ్రామ శివారులో హరితహారం
హత్నూర: తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి రాజమణి అన్నారు. శనివారం బోర్పట్ల గ్రామ శివారులోని కర్నాలకుంట కట్టపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆమె ఈత మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా అనంతరం అధికారులు, విద్యార్థులు, గౌడ కులస్థులు సుమారు 500 ఈత మొక్కలను నాటారు.
నాటిన మొక్కలను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, తహసీల్దార్ ప్రభావతి, ఎంపీడీఓ శ్రవణ్‌కుమార్, ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ ఎస్‌ఐలు పోతిరెడ్డి, ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఎంపీటీసీ సాయమ్మ, సర్పంచ్‌లు వీణాభాస్కర్‌రెడ్డి, బంటు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, టీఆర్‌ఎస్ నాయకులు అశోక్, గౌడ సంఘం నాయకులు అంజాగౌడ్, చెన్నాగౌడ్, దుర్గంగౌడ్, యాదాగౌడ్, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.