ఎంసెట్–2 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అక్రమంగా మార్కులు సాధించిన వారిలో దడ పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో హస్తం ఉన్న వారిని సీఐడీ అరెస్టు చేస్తుండడంతో తదుపరి వంతు తమదేనన్న భావన వీరిలో వస్తున్నట్లు తెలిసింది. లక్షలాది రూపాయలు పోసి ర్యాంకులు సాధిస్తే ఎంసెట్ –2 రద్దుతో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
-
‘లీకేజీ ర్యాంకులు పొందిన వారిలో ప్రభుత్వ అధికారులు, వ్యాపార వర్గాల పిల్లలు
వరంగల్ : ఎంసెట్–2 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అక్రమంగా మార్కులు సాధించిన వారిలో దడ పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో హస్తం ఉన్న వారిని సీఐడీ అరెస్టు చేస్తుండడంతో తదుపరి వంతు తమదేనన్న భావన వీరిలో వస్తున్నట్లు తెలిసింది. లక్షలాది రూపాయలు పోసి ర్యాంకులు సాధిస్తే ఎంసెట్ –2 రద్దుతో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇదిలా ఉండగా లీకేజీ ప్రశ్న పత్రాలు ఎవరెవరు తీసుకున్నారన్న కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఏమి జరుగుతుందోనన్న విషయం తెలియకపోవడంతో ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న వారిలో టెన్షన్ మొదలైంది. భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాలకు చెందిన వారితోపాటు నగరంలోని పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల పిల్లలు, వ్యాపారుల పిల్లలు పెద్ద సంఖ్యలో ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని సీఐడీ ఆదుపులోకి తీసుకోవడంతో వారికి డబ్బులు ఇచ్చిన వారిని ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పలువురు ప్రభుత్వ అధికారుల పేర్లు బయటపడే అవకాశాలున్నాయి. తమ పేర్లు బయటపడితే ఇంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలను ఏసీబీ అధికారులు చెప్పాల్సి వస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది.