Leak affair
-
కానిస్టేబుల్ పరీక్ష పేపర్: ఆ లీక్ తంత్రగాళ్లు ఇక్కడివారేనా?
సాక్షి, హైదరాబాద్: హర్యానా పోలీసు విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన హర్యానా స్టాఫ్ సర్వీస్ కమిషన్ (హెచ్ఎస్ఎస్సీ) పరీక్షల ప్రశ్నపత్రం లీక్ వెనక హైదరాబాద్‌కు చెందిన ముద్రణ సంస్థ పాత్రను అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన ఆ రాష్ట్ర పోలీసులు ఇప్పటికే 14 మందిని అరెస్టు చేశారు. నగరానికి చెందిన ముద్రణ సంస్థ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయడానికి ఓ ప్రత్యేక బృందం ఇక్కడికి చేరుకోనుంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హర్యానా సర్కారు సమగ్ర విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. అసలు కథ ఇదీ.. హర్యానా పోలీసు విభాగంలో 5,500 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హెచ్ఎస్ఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7.72 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న ఈ ఎంపిక పరీక్ష శని, ఆదివారాల్లో రెండు దఫాలుగా జరగాల్సి ఉంది. అక్కడి ఫతేహాబాద్, హోసర్, కౌతల్ ప్రాంతాల్లోని కొన్ని కోంగ్ ఇనిస్టిట్యూట్ల నుం పరీక్ష పేపర్ లీక్ అయినట్లు హెచ్‌ఎస్‌ఎస్‌సీకి ఫిర్యాదులు అందాయి. ఫతేహాబాద్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ యజమాని నరేందర్ పరీక్ష పాస్ చేయిస్తానంటూ తనతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, పేపర్ లీకేజీ ద్వారానే ఇది సాధ్యమని భావిస్తున్నట్లు ఓ అభ్యర్థి శనివారం కౌతల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు, హెచ్ఎస్ఎస్సీ అధికారులు పేపర్ లీక్ అయినట్లు నిర్ధారించారు. శని, ఆదివారాల్లో జరగాల్సిన పరీక్షల్ని రద్దు చేసిన హెచ్ఎస్ఎస్సీ ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా హర్యానా డీజీపీకి విజ్ఞప్తి చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న కౌతల్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. వీళ్లు శని, ఆది, సోమవారాల్లో కైతాల్, కర్నాల్, ఫతేహాబాద్, హోసర్‌ల్లో దాడులు చేశారు. సూత్రధారిగా భావిస్తున్న నరేందర్ సహా మొత్తం 14 మందిని అరెస్టు చేయడంతో పాటు కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలకు సంబంధింన ప్రశ్నపత్రం, ఓఎంఆర్ షీట్స్‌తో పాటు కీలు స్వాధీనం చేసుకున్నారు. లీకైన పేపర్ ఆధారంగా అసలు అభ్యర్థులకు బదులుగా పరీక్షలు రాయడానికి సిద్ధమైన డమ్మీ క్యాండిడేట్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల విచారణలో వెలుగులోకి వ్చన అంశాలతో పాటు హెచ్ఎస్ఎస్సీ అధికారులు అందింన వివరాలతోనే సిటీ లింకు బయటకు వ్చనట్లు తెలిసింది. హెచ్ఎస్ఎస్సీ పరీక్షలకు సంబంధింన ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్స్ డిజైన్, ముద్రణ బాధ్యతల్ని కాంట్రాక్ట్ పద్ధతిన హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తోందని సమాచారం. అందులో పని చేస్తున్న వ్యక్తుల ద్వారానే ఈ పేపర్లు బయటకు వ్చనట్లు హర్యానా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో వ్యవస్థీకృత ముఠాల ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. వీళ్లు ఒక్కో అభ్యర్థి నుంచి ర.కోటి వసలు చేసి పరీక్ష పాస్ చేయించేలా ఒప్పందాలు చేసుకున్నారు. అడ్వాన్స్‌గా ర.20 లక్షల నుంచి ర.30 లక్షల వరకు తీసుకుని మిగిలిన మొత్తాలకు వారి తల్లిదండ్రులకు చెందిన పోస్ట్ డేటెడ్ చెక్స్ తీసుకుని తమ వద్ద ఉంచుకున్నారని కైతల్ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సహా గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరీక్ష పేపర్ల లీకేజీలతో సంబంధం ఉన్న ముఠానే ఈ పని చేసినట్లు అంచనా వేçస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఓ ప్రత్యేక బృందం త్వరలో హైదరాబాద్‌కు రానుంది. -
లీకువీరులకు చెక్
► ప్రయివేటు స్కూళ్లకు ముందుగానే చేరుతున్న ప్రశ్నపత్రాలు ► సమ్మెటివ్–1,2 లీకేజీలతో విద్యాశాఖ అభాసుపాలు ► తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం ► ఏ రోజుకు పరీక్షకు ఆ రోజే ప్రశ్నపత్రాలు ► ఈ నెల 14 నుంచి సమ్మెటివ్–3 పరీక్షలు కర్నూలు సిటీ: సమ్మెటివ్–1,2 పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో అభాసుపాలైన విద్యాశాఖ లోప నివారణ చర్యలకు ఉపక్రమించిం ది. పరీక్షలను పక్కాగా నిర్వహించడంలో విఫలమవుతున్నట్లు వస్తున్న ఆరోపణల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది. పరీక్షకు ముందుగానే ప్రశ్నపత్రాలు ప్రయివేటు స్కూళ్లకు చేరుతుండడమే లీకేజీలకు కారణంగా భావిస్తున్న ఉన్నతాధికారులు ఈ సారి అందుకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. పాఠశాల విద్యలో ఫార్మాటివ్ పరీక్షలు నాలుగుసార్లు, సమ్మెటివ్ పరీక్షలు 3 సార్లు నిర్వహిస్తారు. పదవ తరగతి విద్యార్థులకు మాత్రం సమ్మెటివ్ పరీక్షలు రెండు సార్లు నిర్వహించి గ్రాండ్ టెస్ట్‌లు పెడతారు. ఫార్మాటివ్ పరీక్షల ప్రశ్నపత్రాలను ఆయా స్కూళ్లలోని సబ్జెక్టు నిపుణులు విద్యాప్రణాళిక ప్రకారం రూపొందిస్తారు. సమ్మెటివ్ పరీక్షలకు మాత్రం ప్రశ్న పత్రాలను ప్రభుత్వమే తయారు చేసి ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన నమూనాలోనే అన్ని యాజమాన్యాల స్కూళ్లకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే ప్రయివేటు స్కూళ్లలో వారి సొంత ప్రణాళిక ప్రకారం సిలబస్ బోధిస్తుండడం, పరీక్షలు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇందుకు నివారణ అన్నట్లు ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు తమకున్న పరిచయాలతో ప్రశ్నపత్రాలను ముందే తెప్పించుకోవడం వల్లే ప్రతిసారి లీకేజీ అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయని విద్యాశాఖ చేయించిన విచారణలో తేలింది. ఇలాంటి వాటికి అడ్డుకట్టవేసేందుకే సమ్మెటివ్–3 పరీక్షల ప్రశ్నపత్రాలను డిస్పాచ్‌ను గతంలో కంటే భిన్నంగా చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల14 నుంచి నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరాయి. ఇక్కడి నుంచి డీసీఈబీ అధికారులు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టారు. గతానికి భిన్నంగా..గతంలో పరీక్షలకు ముందుగానే అన్ని ప్రశ్నపత్రాలు ఒకేసారి ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు, కీ సెంటర్లకు అందజేసేవారు. ఈ కారణంతోనే లీకేజీలు అవుతున్నాయని గుర్తించిన అధికారులు సమ్మెటివ్–3 పరీక్షల ప్రశ్నపత్రాలను ఏ రోజుకు ఆ రోజు ఆయా స్కూళ్లకు సంబంధించిన మండల విద్యాధికారుల కార్యాలయం నుంచి తీసుకుపోవాలని చెబుతున్నారు. ఈ ప్రక్రియ మండల కేంద్రాల్లోని పాఠశాలల విషయంలో పెద్దగా సమస్య లేకపోయినా దూరంగా ఉన్న స్కూళ్లకు కొంత ఇబ్బందికరమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఇందుకు అయ్యే రవాణ ఖర్చులు సైతం హెచ్ఎంలే భరించాలని అధికారులు చెబుతుండడం గమనార్హం. సమ్మెటివ్–1,2 పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలు ముందు రోజే లీకయ్యాయి. దీనిపై విచారణ చేయించగా కొన్ని స్కూళ్ల హెచ్ఎంలు, కీ సెంటర్ల దగ్గరే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమ్మెటివ్ –3 పరీక్షలకు పక్కా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రశ్న పత్రాలను మండల కేంద్రంలో భద్రపరిచేందుకు నిర్ణయించాం. – తాహెరా సుల్తానా, డీఈఓ -
అక్ర‘మార్కు’ల్లో దడ
‘లీకేజీ ర్యాంకులు పొందిన వారిలో ప్రభుత్వ అధికారులు, వ్యాపార వర్గాల పిల్లలు వరంగల్ : ఎంసెట్–2 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అక్రమంగా మార్కులు సాధించిన వారిలో దడ పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో హస్తం ఉన్న వారిని సీఐడీ అరెస్టు చేస్తుండడంతో తదుపరి వంతు తమదేనన్న భావన వీరిలో వస్తున్నట్లు తెలిసింది. లక్షలాది రూపాయలు పోసి ర్యాంకులు సాధిస్తే ఎంసెట్ –2 రద్దుతో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇదిలా ఉండగా లీకేజీ ప్రశ్న పత్రాలు ఎవరెవరు తీసుకున్నారన్న కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఏమి జరుగుతుందోనన్న విషయం తెలియకపోవడంతో ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న వారిలో టెన్షన్ మొదలైంది. భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాలకు చెందిన వారితోపాటు నగరంలోని పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల పిల్లలు, వ్యాపారుల పిల్లలు పెద్ద సంఖ్యలో ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని సీఐడీ ఆదుపులోకి తీసుకోవడంతో వారికి డబ్బులు ఇచ్చిన వారిని ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పలువురు ప్రభుత్వ అధికారుల పేర్లు బయటపడే అవకాశాలున్నాయి. తమ పేర్లు బయటపడితే ఇంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలను ఏసీబీ అధికారులు చెప్పాల్సి వస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. -
ఎంసెట్ 2ను రద్దు విరమించుకోవాలి
గజ్వేల్‌రూరల్ : ప్రభుత్వం ఎంసెట్2ను రద్దు చేస్తున్నట్లు విరమించుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కామల్ల భూమయ్యయాదవ్ పేర్కొన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్2ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం ప్రభుత్వ అసమర్ధతను తెలియజేస్తుందన్నారు. ఎంసెట్2 రద్దు ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసెట్ పరీక్షల సమయాల్లో నిమిషం ఆలస్యమైనా అనుమతించమని చెప్పిన ప్రభుత్వం... పరీక్షలపై కట్టుదిట్టంగా నిర్వహించే విషయంపై ఎందుకు లేదని ప్రశ్నించారు. లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించి... దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని, అంతేగాకుండా ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణరావు, చైర్మన్ పాపిరెడ్డిలను సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హన్మంతరెడ్డి, భాస్కర్‌రెడ్డి, సాయి, వినోద్, జాన్సన్, అశోక్, మల్లేశం పాల్గొన్నారు.