కానిస్టేబుల్‌ పరీక్ష పేపర్‌: ఆ లీక్‌ తంత్రగాళ్లు ఇక్కడివారేనా?  | Haryana Constable Exam Paper Leak, Police Suspect Role of Hyderabad Printing Company | Sakshi
Sakshi News home page

HSSC Exam: ఆ లీక్‌ తంత్రగాళ్లు హైదరాబాదీలేనా?

Published Wed, Aug 11 2021 8:07 AM | Last Updated on Wed, Aug 11 2021 11:07 AM

Haryana Constable Exam Paper Leak, Police Suspect Role of Hyderabad Printing Company - Sakshi

కౌతల్‌లో పట్టుబడిన సూత్రధారి నరేందర్‌

సాక్షి, హైదరాబాద్‌: హర్యానా పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన హర్యానా స్టాఫ్‌ సర్వీస్‌ కమిషన్‌ (హెచ్‌ఎస్‌ఎస్‌సీ) పరీక్షల ప్రశ్నపత్రం లీక్‌ వెనక హైదరాబాద్‌కు చెందిన ముద్రణ సంస్థ పాత్రను అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన ఆ రాష్ట్ర పోలీసులు ఇప్పటికే 14 మందిని అరెస్టు చేశారు. నగరానికి చెందిన ముద్రణ సంస్థ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయడానికి ఓ ప్రత్యేక బృందం ఇక్కడికి చేరుకోనుంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హర్యానా సర్కారు సమగ్ర విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించింది.  

అసలు కథ ఇదీ.. 
హర్యానా పోలీసు విభాగంలో 5,500 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి హెచ్‌ఎస్‌ఎస్‌సీ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 7.72 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న ఈ ఎంపిక పరీక్ష శని, ఆదివారాల్లో రెండు దఫాలుగా జరగాల్సి ఉంది. అక్కడి ఫతేహాబాద్, హోసర్, కౌతల్‌ ప్రాంతాల్లోని కొన్ని కోంగ్‌ ఇనిస్టిట్యూట్ల నుం పరీక్ష పేపర్‌ లీక్‌ అయినట్లు హెచ్‌ఎస్‌ఎస్‌సీకి ఫిర్యాదులు అందాయి.

ఫతేహాబాద్‌కు చెందిన ఓ కోచింగ్‌ సెంటర్‌ యజమాని నరేందర్‌ పరీక్ష పాస్‌ చేయిస్తానంటూ తనతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, పేపర్‌ లీకేజీ ద్వారానే ఇది సాధ్యమని భావిస్తున్నట్లు ఓ అభ్యర్థి శనివారం కౌతల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు, హెచ్‌ఎస్‌ఎస్‌సీ అధికారులు పేపర్‌ లీక్‌ అయినట్లు నిర్ధారించారు. శని, ఆదివారాల్లో జరగాల్సిన పరీక్షల్ని రద్దు చేసిన హెచ్‌ఎస్‌ఎస్‌సీ ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా హర్యానా డీజీపీకి విజ్ఞప్తి చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న కౌతల్‌ పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. 

వీళ్లు శని, ఆది, సోమవారాల్లో కైతాల్, కర్నాల్, ఫతేహాబాద్, హోసర్‌ల్లో దాడులు చేశారు. సూత్రధారిగా భావిస్తున్న నరేందర్‌ సహా మొత్తం 14 మందిని అరెస్టు చేయడంతో పాటు కానిస్టేబుల్‌ ఎంపిక పరీక్షలకు సంబంధింన ప్రశ్నపత్రం, ఓఎంఆర్‌ షీట్స్‌తో పాటు కీలు స్వాధీనం చేసుకున్నారు. లీకైన పేపర్‌ ఆధారంగా అసలు అభ్యర్థులకు బదులుగా పరీక్షలు రాయడానికి సిద్ధమైన డమ్మీ క్యాండిడేట్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల విచారణలో వెలుగులోకి వ్చన అంశాలతో పాటు హెచ్‌ఎస్‌ఎస్‌సీ అధికారులు అందింన వివరాలతోనే సిటీ లింకు బయటకు వ్చనట్లు తెలిసింది. 

హెచ్‌ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సంబంధింన ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్‌ షీట్స్‌ డిజైన్, ముద్రణ బాధ్యతల్ని కాంట్రాక్ట్‌ పద్ధతిన హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తోందని సమాచారం. అందులో పని చేస్తున్న వ్యక్తుల ద్వారానే ఈ పేపర్లు బయటకు వ్చనట్లు హర్యానా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో వ్యవస్థీకృత ముఠాల ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. వీళ్లు ఒక్కో అభ్యర్థి నుంచి ర.కోటి వసలు చేసి పరీక్ష పాస్‌ చేయించేలా ఒప్పందాలు చేసుకున్నారు. 

అడ్వాన్స్‌గా ర.20 లక్షల నుంచి ర.30 లక్షల వరకు తీసుకుని మిగిలిన మొత్తాలకు వారి తల్లిదండ్రులకు చెందిన పోస్ట్‌ డేటెడ్‌ చెక్స్‌ తీసుకుని తమ వద్ద ఉంచుకున్నారని కైతల్‌ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సహా గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరీక్ష పేపర్ల లీకేజీలతో సంబంధం ఉన్న ముఠానే ఈ పని చేసినట్లు అంచనా వేçస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఓ ప్రత్యేక బృందం త్వరలో హైదరాబాద్‌కు రానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement